Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంఆర్ చైర్మెన్ వెల్లడి
న్యూఢిల్లీ : దక్షిణ, ఆగేయ ఆసియా ప్రాంతాల్లోని విమానాశ్రయాల అభివద్ధిపై జీఎంఆర్ గ్రూపు ఆసక్తి చూపుతోందని ఆ సంస్థ చైర్మెన్ గ్రంథి మల్లి ఖార్జున రావు తెలిపారు. ఈ ప్రాంతాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావి స్తోన్నామన్నారు. ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివద్ధికి జీఎంఆర్ ప్రస్తుతం రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. గ్రూపే ఏడీపీ భాగస్వామ్యంతో విమానాశ్రయాల వ్యాపారం మరింత బలోపేతం కానుందన్నారు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)లో గ్రూపే ఎడిపికిి 49 శాతం వాటాను విక్రయించే ప్రక్రియ రెండో విడత కూడా పూర్తయిందని తెలిపారు. విమానాశ్రయాల నిర్వహణ జిఎంఆర్ స్వాధీనంలోనే ఉంటుందన్నారు. అన్నీ అనుకూలిస్తే 2022 ఆగస్టు నాటికి గోవా విమానాశ్రయం పూర్తి కావవచ్చన్నారు. విజయనగరం సమీపంలో చేపట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు ఊపందుకు న్నాయన్నారు. భూమి అభివద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మొత్తం 2,200 ఎకరాల్లో రూ.1,650 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.