Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇవ్వడం కోసం సొనాలికా గ్రూప్ ఓ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ట్రాక్టర్లతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత మెషినరీని 'సొనాలికా అగ్రో సొల్యూషన్స్' యాప్ ద్వారా రైతులు అద్దెకు తీసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. యాప్ రైతులను విస్తత శ్రేణి వ్యవసాయ యంత్రాలతో అనుసంధానం చేస్తుందని పేర్కొంది. రైతులు తమ వీలును, అవసరాలనుబట్టి వీటిని అద్దెకు తీసుకోవచ్చని సొనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ తెలిపారు.