Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,840 కోట్ల పెట్టుబడులు పెట్టింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.844 కోట్ల వ్యయంతో పోల్చితే.. రెట్టింపు చోటు చేసుకుంది. మౌలిక వసతులు, ఉత్పాదనలో పెట్టుబడులు కొనసాగుతాయని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో మొత్తగా రూ.17,000 కోట్ల మేర పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతక్రితం 2020-21లోని రూ.13,284 కోట్లతో పోల్చితే 28 శాతం ఎక్కువ. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా 80 శాతం వాటా కలిగి ఉంది.