Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిజిటల్ సమానత్వంను సాధ్యం చేయాలనే భాగస్వామ్య నిబద్ధతతో ఎస్ఏపీ ఇండియా , మైక్రోసాఫ్ట్ లు తమ ఉమ్మడి నైపుణ్య కార్యక్రమం ‘టెక్‌సాక్షం’ ( https://techsaksham.org ) ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా వెనుక బడిన వర్గాలకు చెందిన యుక్త వయసు మహిళా విద్యార్థులకు సాంకేతిక రంగంలో కెరీర్లను నిర్మించుకునే అవకాశం అందిస్తారు. ఈ ఉమ్మడి కార్యక్రమం ద్వారా ఎస్ఏపీ ఇండియా మరియు మైక్రోసాఫ్ట్‌లు కృత్రిమ మేథస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్ మరియు డిజిటల్ మార్కెటింగ్ లో 62వేల మంది విద్యార్థులకు నైపుణ్యం అందించనున్నాయి. ఈ కార్యక్రమం, ఏఐసీటీఈ శిక్షణ మరియు అభ్యాస అకాడమీ –ఏటీఏఎల్తో పాటుగా రాష్ట్ర కళాశాల విద్యా శాఖలతో భాగస్వామ్యాలు చేసుకుని, పార్టిస్పేటింగ్ సంస్థల వద్ద ఫ్యాకల్టీ వృత్తిపరమైన అభివృద్ధికి సైతం మద్దతునందించనుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే తొలి సంవత్సరంలోనే, ఈ కార్యక్రమం ద్వారా 1500 మంది టీచర్లకు శిక్షణ అందించనున్నారు మరియు శిక్షణ పొందిన ఫ్యాకల్టీలోని ప్రతి ఒక్కరూ ఓ సంవత్సరంలో 50 మంది విద్యార్థులకు మద్దతునందించనున్నారు. తద్వారా 60000–75000 మంది విద్యార్థులపై ప్రభావం చూపనున్నారు.
ఈ సహకార, భారతదేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎడ్యునెట్ ఫౌండేషన్ అమలు చేయనుంది. ఈ సంస్థ సైన్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, వొకేషనల్ విద్యలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న యుక్త వయసు మహిళల నైపుణ్యం మెరుగుపరచనుంది. సాంకేతికత మరియు యాక్టివిటీ ఆధారిత ఎంగేజ్మెంట్స్లో అప్లికేషన్లను అర్థం చేసుకునే ముఖ్యమైన కరిక్యులమ్ అర్థం చేసుకునేందుకు తగిన అవకాశాలను ఈ కార్యక్రమం అందిస్తుంది. నిష్ణాతులైన మెంటార్ల పర్యవేక్షణలో నైపుణ్యాలను సంతరించుకోవడం వల్ల ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నామనే భరోసానూ పొందగలరు. అంతేకాదు విద్యార్థులు తమ పనిని వ్యాపార నాయకులకు ప్రదర్శించుకోవడంతో పాటుగా స్థానిక పరిశ్రమల నిపుణులకు సైతం చూపడం ద్వారా పరిశ్రమ పర్యావరణ వ్యవస్ధతో ముందుగానే సంబంధాలనూ ఏర్పరుచుకోవచ్చు. తన అభిప్రాయాలను ప్రొఫెసర్ అనిల్ డీ సహస్రబుద్ధి, ఛైర్మన్– ఏఐసీటీఈ వెల్లడిస్తూ ‘‘ ఎస్ఏపీ ఇండియా మరియు మైక్రోసాఫ్ట్ ఆరంభించిన ఉమ్మడి కార్యక్రమం టెక్‌సాక్షం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విభాగాలైనటువంటి ఏఐ, వెబ్ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్ విభాగాలలో ఏఐసీటీఈ ఏటీఏఎల్తో భాగస్వామ్యం చేసుకుని భారతదేశంలోని మహిళలకు సాధికారిత తీసుకురావడంతో పాటుగా పని ప్రాంగణాలలో వాతావరణం సైతం మార్చనుంది. దాదాపు 60వేలకు పైగా మహిళలకు శిక్షణ అందించడం ద్వారా భారీ మార్పును తీసుకురానున్నారు. అంతేకాదు, 1000మందికి పైగా మహిళా ఫ్యాకల్టీ సర్టిఫైడ్ కావడంతో, కేవలం గ్రాడ్యుయేట్ల ఉపాధి పరంగా మాత్రమే భారీ మార్పులను తీసుకురావడం కాకుండా మరెంతో మంది విద్యార్ధులు తమ స్టార్టప్ ప్రయాణం ఆరంభించేందుకు తగిన ప్రోత్సాహమూ అందిస్తుంది. ఏఐసీటీఈ స్ధిరంగా అవగాహనను మెరుగుపరచడంతో పాటుగా తమ వాటాదారులందరికీ తగిన సాధికారిత అందించడం ద్వారా ఇండియాను అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా నిలుపనుంది. దీనికి టెక్‌సాక్షం సరైన వేదిక. నూతన తరపు అభ్యాసకులకు శుభం చేకూరాలని ఏఐసీటీఈ ఆకాంక్షిస్తుంది’’ అని అన్నారు. కుల్మీత్ బావా, అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్,ఎస్ఏపీ– ఇండియా ఉపఖండం మాట్లాడుతూ ‘‘ డిజిటల్ ఇన్‌క్లూజన్ ను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో మేము ఎల్లప్పుడూ ముందే ఉంటుంటాము. మా ప్రతిష్టాత్మక కార్యక్రమాలైనటువంటి కోడ్ ఉన్నతి వంటి వాటి ద్వారా సమానత్వంను తీసుకువస్తున్నాము. వీటిద్వారా మేము దాదాపు 1.8 మిలియన్ల మంది కౌమారదశ పిల్లలు మరియు చిన్నారులను డిజిటల్ ఇన్క్లూజన్లో భాగం చేశాం. మైక్రోసాఫ్ట్‌తో మా భాగస్వామ్యం, ఈ లక్ష్యానికి విస్తరణ. దీనిలో భాగంగా మన దేశపు యుక్తవయసు మహిళకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలైనటువంటి ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలలో తగిన సాధికారితనందించడం ద్వారా భవిష్యత్‌కు సిద్ధమైన వర్క్‌ఫోర్స్‌లో వారిని భాగం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా, మేము సమానమైన, వైవిధ్యమైన మరియు సమ్మిళిత కార్యక్షేత్రంను రేపటి కోసం తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి అనంత్ మహేశ్వరి, అధ్యక్షులు, మైక్రోసాఫ్ట్ ఇండియా మాట్లాడుతూ ‘‘మైక్రోసాఫ్ట్