Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్)కు చెందిన ఎస్సెట్ మేనేజర్ నిప్పాన్ లైఫ్ ఇండియా ఎస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (నామ్ ఇండియా) ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ద్వారా రూ.2;860 కోట్ల నిధులు సమీకరించింది. దీంతో ఇటీవలి ఎన్ఎఫ్ఒల్లో అతిపెద్దదిగా నిలిచిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫండ్‌లో వచ్చిన నిదులను భారీ, మధ్య, చిన్న తరహా క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులుగా పెట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగస్వామ్యం అయిన 2.52 లక్షల మంది మదుపర్లకు ధన్యవాదాలని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సీఈఓ సందీప్ సిక్కా పేర్కొన్నారు.