Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఓఎం 'మాన్సూన్ ధమాకా స్కీమ్'
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రుణ గ్రహీతలను ఆకర్షించడానికి మాన్సూన్ ధమాకా స్కీమ్‌ను ప్రకటించింది. ఇందులో తన ఖాతాదారులకు రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. గృహ రుణాలు సహా కార్లు, బంగారం తనఖా, రిటైల్ రుణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ బ్యాంక్ తెలిపింది. మరోవైపు వడ్డీ రాయితీ కూడా కల్పిస్తోన్నట్టు పేర్కొంది. ఈ రుణాలపై 6.90 నుంచి 7.30 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నట్టు పేర్కొంది. గృహం కోసం అప్పు తీసుకున్న వారు బకాయిలు లేకుండా రుణ వాయిదాలు చెల్లిస్తే రెండు ఈఎంఐలను రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. కార్లు, గృహాల కొనుగోళ్లకు 90 శాతం రుణ పరపతి కల్పిస్తున్నట్టు వెల్లడించింది. తమ ఖాతాదారులకు పసిడి, గృహ, కార్ల రుణాలపై ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన బహుమతి ఇవ్వాలని నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ తమ్తా తెలిపారు.. తక్కువ వడ్డీరేట్లపై లబ్ధి పొందే వారికి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నామన్నారు. రూ.20 లక్షల వరకు పసిగి రుణాలపై 7.10 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్టు ఆ బ్యాంక్ పేర్కొంది.