Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెబీకి రోజుకో దరఖాస్తు
- నిధుల సేకరణలో సంస్థలు
ముంబయి : దేశంలో అనేక సంస్థలు పెట్టుబడుల సమీకరణ కోసం మార్కెట్లకు వరుస కడుతున్నాయి. నిధుల వేటలో భాగంగా ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం ఆత్రుత పడుతున్నాయి. ఇటీవల అనుమతుల కోసం సెబీకి రోజుకు ఒక దరఖాస్తు పైనే వస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు దూమ్ మీద ఉండటంతో పరిస్థితులను అందిపుచ్చుకోవాలని అనేక సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్‌లో మొదటి 20 రోజుల్లోనే సెబీకి ఐపీఓలకు అనుమతి కోరుతూ 23 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అదే విధంగా ఈనెల్లో ఇప్పటికే 18 కంపెనీలు ఇష్యూకు వచ్చాయి. దీంతో దాదాపుగా రూ.18,200 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇవి రూ.70,000 కోట్లను ప్రజల నుంచి సమీకరించాయి. ఇటీవలి ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్లకు రిటైల్ మదుపర్లు చాలా ఆసక్తిని కనబర్చాయి. పలు సంస్థలు 100 రెట్లకు పైగా బిడ్లు అందుకున్న సంస్థలు ఉన్నాయి. ప్రస్తుత ఏడాదిలో 100 సంస్థలు ఐపిఒకు రావొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఐపిఒకు దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో ఢిల్లీకి చెందిన పాలసీబజార్ మాతృసంస్థ పీబీ ఇన్ఫోటెక్ రూ.6,000 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూణెకు చెందిన ఎమ్క్యుర్ ఫార్మా రూ.5,000 కోట్ల ఇష్యూకు వస్తోంది. ఆన్లైన్ ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ నైకా (రూ.4,000 కోట్లు, ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ఇక్సిగో మాతసంస్థ లీట్రావెన్యూస్ టెక్నాలజీ సైతం రూ.1,800 కోట్ల సమీకరణకు రానున్నాయి.
అదానీ విల్మర్ ఐపిఒకు సెబీ షాక్
గౌతం అదానీకి చెందిన వంట నూనెల తయారీదారు అదానీ విల్మర్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ప్రతిపాదనను మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అనుహ్యాంగా నిలిపివేసింది. ఈ ఐపిఒ ద్వారా రూ.4500 కోట్ల నిధులు సమీకరించాలని అదానీ విల్మర్ లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ గ్రూపు కంపెనీల్లో మారిషాస్ కేంద్రంగా పని చేస్తున్న హవాలా సంస్థలు వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. సెబీ నియమాల ప్రకారం ఐపిఒకు దరఖాస్తు చేసుకున్న సంస్థకు సంబంధించిన కంపెనీపై ఏదైనా దర్యాప్తు కొనసాగుతున్న కాలంలో 90 రోజుల వరకు అనుమతులు లభించవు. దీన్ని మరో 45 రోజుల పాటు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అదానీ విల్మర్ ప్రధాన వంటనూనెల బ్రాండ్ 'ఫార్చ్యూన్' ఉత్పత్తి చేస్తుంది. అదానీ విల్మర్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 50 శాతం వాటా ఉంది. సింగపూర్ కంపెనీ విల్మర్‌కు మిగితా సగం వాటా ఉంది.