Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ వ్యక్తి ఆర్ధిక ఆరోగ్యాన్ని క్రెడిట్ స్కోర్‌తో కనుగొంటారు. క్రెడిట్ రేటింగ్ కంపెనీలు అందించే మూడు అంకెల సంఖ్య ఇది. ఋణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను వారి క్రెడిట్ చరిత్ర ఆధారంగా కంపెనీలు కనుగొంటాయి. ఈ స్కోర్ 300–900 నడుమ ఉంటుంది. సాధారణంగా 750కు పైన క్రెడిట్ స్కోర్ ఉంటే అది చక్కటి స్కోర్‌గా పరిగణిస్తారు. చక్కటి క్రెడిట్ స్కోర్ ఉంటే, తక్కువ వడ్డీరేట్లకు ఋణాలను సైతం బ్యాంకులు అందిస్తాయి. వీటితో పాటుగా ఋణాలు, క్రెడిట్ కార్డులు వంటివి అత్యంత ఆకర్షణీయమైన రీతిలో పొందవచ్చు. ఆరోగ్యవంతమైన ఆర్ధిక అలవాట్లను అనుసరించడం ద్వారా దీనిని చేరుకోవచ్చు.
చక్కటి క్రెడిట్ స్కోర్ నిర్వహించడానికి అనుసరించాల్సిన పంచ సూత్రాలు
1. ఆరోగ్యవంతమైన చెల్లింపు చరిత్రను నిర్వహించాలి
ఒకరి చెల్లింపు చరిత్రపై ఒకరి క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఋణగ్రహీత సకాలంలో చెల్లింపులు జరపడం బాధ్యత. ఋణలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌పై ఋణాత్మక ప్రభావం పడకుండా చూడవచ్చు. ప్రతి నెలా బ్యాంకులో ఈఎంఐ చెల్లింపులకు తగు మొత్తంలో నగదు ఉండేటట్లు జాగ్రత్త పడటంతో పాటుగా క్రెడిట్‌కార్డు చెల్లింపులను గడువుకు ముందు చెల్లించడం అసలు మరిచిపోకూడదు. ఒకవేళ ఆ బిల్లులను పూర్తిగా చెల్లించలేకపోతే కనీస మొత్తం అయినా చెల్లించాలి
2. క్రెడిట్ వినియోగ రేషియో నిర్వహణ
ఓ వ్యక్తికి లభించే మొత్తం ఋణంలో ఎంత మొత్తం ఓ వ్యక్తి వినియోగించుకున్నాడనే దాని ఆధారంగా క్రెడిట్ వినియోగ రేషియో గుణిస్తారు. క్రెడిట్ స్కోర్‌పై అత్యధికంగా ప్రభావం చూపే రెండో అంశమిది. క్రెడిట్ వినియోగ రేషియో ఖచ్చితంగా 30% లోపుగా ఉండాలి. ఈ రేషియో ఎంత తక్కువ ఉంటే అంతగా ఈ క్రెడిట్ స్కోర్ వృద్ధి చెందుతుంది.
3. మీ స్కోర్ రెగ్యులర్‌గా పరీక్షించుకోవాలి
క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్‌గా సమీక్షించడంతో పాటుగా ఏమైనా వివాదాలుంటే వెంటనే సంబంధిత అధికారులకు వెల్లడించాలి.
4. పాత ఖాతాల పట్ల ఆప్రమప్తంగా ఉండాలి
క్రెడిట్ స్కోర్‌పై ఒకరి క్రెడిట్ చరిత్ర కూడా ప్రభావంచూపుతుంది. సుదీర్ఘకాలం పాటు ఓ బ్యాంకుతో అనుబంధం కలిగి ఉంటే అది క్రెడిట్ స్కోర్‌పై కూడా చక్కటి ప్రభావం చూపుతుంది.
5. ఋణాలను తెలివిగా ప్రణాళిక చేసుకోవాలి
పాత ఋణ ఖాతాలను కూడా క్రెడిట్ స్కోర్ పరిగణలోకి తీసుకుంటుంది. ఎక్కువగా వాయిదాలను చెల్లించకపోవడం అనేది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ నిర్వహణకు తగిన చర్యలను తీసుకోవడం మంచిది.
ఈ అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను చక్కగా నిర్వహించడంలో తోడ్పడటంతో పాటుగా ఋణ దరఖాస్తులను ఋణదాతలు తిరస్కరించకుండా ఉండేందుకు సైతం తోడ్పడతాయి.