Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సింగపూర్‌కు చెందిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ అయిన టీచీ భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. వీలైట్ టెక్నలాజీ పిటిఇ అనుబంధ సంస్థగా ఉన్న టీచీ దక్షిణ కొరియాలో విజయవంతమైందని పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో తమ బీటాను ప్రారంభించినప్పటి నుంచి 35,000 మంది బోధకులను తమ వేదికపైకి తెచ్చినట్లు తెలిపింది. ఇక్కడి రీజియన్‌లో 'సాస్' పేరుతో సేవలందించనున్నట్లు తెలిపింది. వినియోగదారులకు అనుకూలమైన టీచీ యొక్క వేదిక ఉపాధ్యాయుల, విద్యార్థుల పరస్పర సంభాషణలకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. 2022 చివరికల్లా తమ వేదిక మరో 10 దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది.