Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీదారు టాటా మోటార్స్ ప్రస్తుత పండగ సీజన్లో వినియోగదారులను ఆకర్షించడానికి ఎస్యువి విభాగంలో 'పంచ్' పేరుతో నూతన కారును ఆవిష్కరించింది. గతేడాది ఆటో ఎక్స్‌పోలో దీన్నే హెచ్2ఎక్స్ పేరుతో ప్రదర్శించింది. సోమవారం ఈ వాహన ఫీచర్లను ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఎస్యువి బుకింగ్స్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని, టాటా పంచ్ పేరుకు తగినట్టే ఎక్కడికి వెళ్లేందుకైనా అనువైన ఎనర్జిటిక్ వాహనమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. టాటా పంచ్ అత్యాధునిక ఫీచర్లతో పాటు స్టన్నింగ్ డిజైన్, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనిమిక్స్ల మేళవింపుతో ఆకట్టుకుంటుందని అన్నారు. తమ ఎస్యువి కుటుంబంలో పంచ్ నాలుగవ ఎడిషన్ అని తెలిపారు. దీని ధరను ప్రకటించాల్సి ఉంది.