Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 కల్లా సమస్యలను పరిష్కరించాలి : మంత్రి
న్యూఢిల్లీ : ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో ఎదురవుతున్న అవాంతరాలపై కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ వివరణ ఇచ్చింది. ఇందుకోసం సోమవారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్ కలిశారు. పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల గురించి పరేఖ్ వివరించినట్లు ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ తీవ్ర అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనిపై పన్ను చెల్లింపుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదివారం ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. దీంతో హడావుడిగా పరేఖ్ మంత్రితో భేటీ అయ్యారు. తాజా భేటీలో మంత్రి సీతారామన్ సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఆలోగా సమస్యను పరిష్కరించాలని కోరారు.