Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 లక్షల మందికి పైగా వినియోగదారులు
హైదరాబాద్: ప్రస్తుతం తమ యాప్లో FASTagలను జారీ చేసేందుకు 26 బ్యాంకులు లైవ్లో ఉండడంతో ఈ రంగంలో నేడు తాము అత్యంత సమగ్రమైన బ్యాంక్ కవరేజీని అందిస్తున్నామని భారతదేశపు అతిపెద్ద డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe ఈ రోజు ప్రకటించింది. ఇది దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది వాహన యజమానులకు తమ FASTagలను రీఛార్జ్ చేసుకోవడంలో అసమానమైన సౌకర్యాన్ని అందిస్తుంది. యాప్లో ఇప్పటివరకు FASTagలను రీఛార్జ్ చేసుకున్న 60 లక్షల మందికి పైగా వినియోగదారులకు PhonePe సేవలు అందించింది. డిసెంబర్ 2020తో పోల్చితే జులై 2021లో FASTag రీఛార్జ్ లలో మూడు రెట్ల పెరుగుదల కనిపించింది. FASTagలతో GST ఇవే బిల్లును కలపడంతో పాటు FASTagలను ఉపయోగించుకోవడానికి కస్టమర్లకు కొత్త మార్గాలను చేర్చడంతో ఈ వృద్ధి శరవేగంగా చోటు చేసుకుంది. షాపింగ్ మాల్స్ ల వద్ద పార్కింగ్, పెట్రోల్ పంపుల వద్ద ఇంధన పేమెంట్లకు పే చేయడం లాంటి కొత్త మార్గాలను చేర్చింది.
ఈ పరిమాణం గురించి PhonePe డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ, “నేడు FASTag రీఛార్జ్ల రంగంలో మా వినియోగదారులకు అత్యంత విస్తృతమైన బ్యాంక్ కవరేజీని అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మెరుగైన వినియోగదారు అనుభవం, ఈ రంగంలో అత్యధిక లావాదేవీల విజయం రేట్లు, ఒకే చోట అనేక FASTagలను నిర్వహించే సౌలభ్యం లాంటివి FASTag రీఛార్జ్ లకు PhonePeను ప్రధాన గమ్య స్థానంగా మార్చాయి. వేగంగా పెరుగుతున్న మా వినియోగదారుల అవసరాలను తీర్చేలా బ్యాంక్ కవరేజీని మరింత విస్తరించే దిశగా మేము కృషి చేస్తున్నాము.” అని అన్నారు.