Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం: కోవిడ్–19 టెస్ట్ ప్రిపరేషన్ సేవలలో దేశవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) దేశవ్యాప్తంగా ఉన్న తమ 215 కేంద్రాలలో తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్–19 టీకాలను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో ఉన్న తమ శాఖలో బోధన, బోధనేతర సిబ్బందందరికి టీకా అందించింది. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ 'ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో పాటుగా, జాతీయ స్థాయిలో ఓ హెల్ప్‌లైన్‌ను సైతం ఏఈఎస్ఎల్ నిర్వహిస్తుంది. దీనిద్వారా వైద్య సహాయం కావాల్సిన తమ ఉద్యోగులకు మద్దతునందిస్తుంది. అంతేకాకుండా, కోవిడ్–19తో ఎవరైనా సిబ్బంది మృత్యువాత పడితే, ఆ ఉద్యోగుల ఓ సంవత్సర జీతాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తామని వెల్లడించింది. అలాగే మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్య భీమాను మూడు సంవత్సరాల పాటు అందించడంతో పాటుగా వారి పిల్లల గ్రాడ్యుయేషన్ వరకూ సహాయం చేయనున్నట్టు' తెలిపారు.