Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో అతి పెద్ద క్రెడిట్‌కార్డు సదుపాయాల్ని కల్పిస్తున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నేడు ఫిబ్రవరి 2022 నుంచి ప్రారంభమయ్యేలా ప్రతి నెలా తన పోర్ట్‌ఫోలియోకు ఐదు లక్షల కొత్త క్రెడిట్ కార్డులను చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనితో మార్కెట్లో తన వాటాను తిరిగి దక్కించుకోనుంది మరియు క్రెడిట్ కార్డులు జారీ చేసే లావాదేవీల్లో తన నాయకత్వ స్థానాన్ని వచ్చే 9 నుంచి 12 నెలల్లో బలోపేతం చేసుకోనుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఈ ప్రగతిని ముందుకు తోడ్కొని వెళ్లేందుకు రానున్న 6 నుంచి 9 నెలల్లో 20కుపైగా సరికొత్త ప్రయత్నాలను మార్కెట్‌కు తీసుకు రానుంది. వీటిలో కార్పొరేట్ ఇండియాలో ఔషధ, పర్యాటక, ఎఫ్ఎంసిజి, ఆతిథ్యం, టెలికాం మరియు ఫిన్‌టెక్ క్షేత్రాల్లో చక్కని గుర్తింపు ఉన్న ప్రసిద్ధ కంపెనీలతో కొత్త కో-బ్రాండెడ్ కార్డులు ఉన్నాయి. గత 9 నెలల నుంచి బ్యాంకు తన ప్రస్తుత శ్రేణిలోని క్రెడిట్ కార్డులను నవీకరిస్తోంది మరియు కొత్త కంపెనీలతో ప్రణాళికాబద్ధమైన వాటా కోసం సిద్ధమైంది.
కొత్త మరియు వృద్ధి చేసిన క్రెడిట్ కార్డు ఉత్పత్తులు గ్రూపు మార్కెట్ నుంచి అల్ట్రా-ప్రీమియం ఉత్పత్తుల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదాన్ని అందిస్తుంది. వినియోగదారులకు వారికి విస్తరిస్తున్న అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులు కూడా వీటిలో ఉన్నాయి. ‘‘గత కొన్ని నెలల్లో మా భవిష్యత్తుకు సిద్ధం చేయడంలో గడపనున్నాము. నియంత్రణ సంస్థ నిర్బంధాలు ఉన్నప్పుడు మేము కొత్త ప్రణాళికలను రూపొందించుకునేందుకు సమయాన్ని వినియోగించుకున్నాము. మా కొత్త ఆఫర్లు అలానే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్డుల పరిధి నుంచి మేము మా వినియోగదారుల అవసరాలను నెరవేర్చే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము మరియు ‘భారీ స్థాయిలో అడుగుపెట్టనున్నాము’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్స్ కన్సూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఐటి గ్రూపు హెడ్ పరాగ్ రావు తెలిపారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్‌కార్డులను జారీ చేయడం మరియు లావాదేవీల స్వాధీనంలో బలమైన వాటా కలిగి ఉండడం ద్వారా చెల్లింపుల వ్యవస్థలో ముందంజలో ఉంది. బ్యాంకు దేశంలో అత్యంత పెద్ద క్రెడిట్ కార్డులను జారీ చేసే సంస్థగా ఉంది మరియు గత 8 నెలల నుంచి తన నాయకత్వ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తూ, కార్డు పోర్ట్‌ఫోలియోలో తన సదృఢత మరియు స్థిరత్వాన్ని నిరూపించుకుంది.
ఈ శక్తిని మరింత ప్రదర్శించేందుకు కొన్ని ప్రముఖ ఆర్బిఐ డేటా పాయింట్లు:
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు తన సమీప ప్రత్యర్థి కన్నా 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేయబడుతున్నాయి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన సమీప ప్రత్యర్థి కన్నా 1.2 రెట్లు ఎక్కువ సంఖ్యలో కార్డులను కలిగి ఉంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతి కార్డులో క్రెడిట్ ఖర్చు చేయడంలో టాప్ 6 బ్యాంకుల్లో అత్యంత ఎక్కువగా ఉంది (సిఐఎఫ్ మరియు ఖర్చులు) బ్యాంకు వ్యాపార స్వాధీన రంగంలోనూ ప్రభావం చూపించే స్థానంలో ఉంది.
ఆర్బిఐ డేటా ప్రకారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వరుసగా వ్యాపారాన్ని స్వాధీనపరుచుకునే లావాదేవీల్లో మొత్తం మీద అత్యంత ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. జూన్ 2021 నాటికి బ్యాంకు మొత్తం 47.9% వాటాను కలిగి ఉంది.ఫ్రాంఛాయిసీ డేటా ప్రకారం అత్యుత్తమ బుక్ క్వాలిటీ-ప్రతి వ్యాపారానికి అత్యంత ఎక్కువగా ఉంది. దీని స్మార్ట్‌హబ్ ప్లాట్ఫారం అన్ని వ్యాపార విభాగాలు మరియు పరిమాణానికి ప్రత్యేకంగా రూపొందించిన ఏకీకృత బ్యాంకింగ్ మరియు పేమెంట్స్ శ్రేణిగా ఉంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3.67 కోట్ల డెబిట్ కార్డులు, 1.48 కోట్ల క్రెడిట్ కార్డులు మరియు 21.34 లక్షల యాక్సెప్టెన్స్ పాయింట్లతో దేశంలో అత్యంత పెద్ద నగదు రహిత చెల్లింపుల సేవలను అందించే సంస్థగా ఉంది. బ్యాంకు 5.1 కోట్ల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మరియు ప్రీపెయిడ్ కార్డులు ప్రతి మార్కెట్ వర్గానికీ అందించి, భారతదేశంలో ఖర్చు చేసే ప్రతి మూడవ రూపాయి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కార్డుల ద్వారానే జరుగుతున్నాయి. ఇది భారతదేశం కొనుగోలు గాథను విస్తరించడంలో పలు సంవత్సరాల నుంచి గమనార్హమైన పాత్రను పోషిస్తోంది. రానున్న పండుగ సీజన్ ఈ పాత్రను గతంలో కన్నా అత్యంత అవసరం ఉన్న సమయంలో మరింత చక్కగా నిర్వహించనుంది.