Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రతి నెలా తన పోర్ట్‌ఫోలియోకు ఐదు లక్షల కొత్త క్రెడిట్ కార్డులను చేర్చాలని నిర్దేశించుకున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తెలిపింది. దీనితో మార్కెట్లో తన వాటాను తిరిగి దక్కించుకోనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేసింది. ఇందుకోసం రానున్న 6 నుంచి 9 నెలల్లో 20కుపైగా సరికొత్త ప్రయత్నాలను మార్కెట్‌కు తీసుకు రానున్నట్లు పేర్కొంది. వీటిలో కార్పొరేట్ ఇండియాలో ఔషధ, పర్యాటక, ఎఫ్ఎంసిజి, ఆతిథ్యం, టెలికాం, ఫిన్‌టెక్ క్షేత్రాల్లో చక్కని గుర్తింపు ఉన్న ప్రసిద్ధ కంపెనీలతో కొత్త కో-బ్రాండెడ్ కార్డులు ఉన్నాయని పేర్కొంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3.67 కోట్ల డెబిట్ కార్డులు, 1.48 కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేసింది.