Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హ్యుందారు మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన కొత్త మోడల్ ఐ20 ఎన్ లైన్‌కు మంగళవారం నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. రూ.25వేలతో తమ డీలర్ల వద్ద ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందించనున్నట్లు వెల్లడించింది. భారత వినియోగదారులు, రవాణపై ఉన్న తమ అంకిత భావాన్ని ఈ వాహనం నిరూపించనుందని హెచ్ఎంఐఎల్ సిఇఒ ఎస్ఎస్ కిమ్ తెలిపారు. 1.01 టర్బో జిడిఐ ఇంజిన్ కలిగిన ఈ వాహనం లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుందని ఆ సంస్థ పేర్కొంది.