Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ ఎండ్–టు–ఎండ్ లాజిస్టిక్స్, సరఫరా శ్రేణి సేవల కంపెనీ డెలివరీ , బెంగళూరు కేంద్రంగా కలిగిన స్పాటాన్ లాజిస్టిక్స్‌ను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇది డెలివరీ యొక్క ప్రస్తుత బీ2బీ సామర్థ్యంలను మరింతగా వృద్ధి చేయనుంది.
ఈ అంశమై డెలివరీ సీఈవో సాహిల్ బారువా మాట్లాడుతూ ‘‘ వృద్ధి ఆధారితంగా ఉండటంతో పాటుగా మా వ్యాపార శ్రేణిలో ప్రతి అంశంలోనూ విస్తరించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా ఈ అభివృద్ధి జరిగింది. గత 10 సంవత్సరాలుగా, బీ2సీ లాజిస్టిక్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న డెలివరీ, ఇప్పుడు మా సొంతమైన ట్రక్లోడ్ వ్యాపారాన్ని స్పాటాన్తో మిళితం చేశాం. తద్వారా బీ2బీ ఎక్స్‌ప్రెస్‌లో కూడా అదే స్థానం పొందగలమని ఆశిస్తున్నాము. మరీ ముఖ్యంగా, బీ2సీ మరియు బీ2బీ ఎక్స్‌ప్రెస్ వ్యాపారంలోని సారుప్యతల ప్రయోజనాలను డెలివరీ స్పాటాన్ వినియోగదారులకు అందించగలము. తద్వారా మరింతగా మా సమగ్రమైన సరఫరా చైన్ సామర్థ్యాలను సైతం వృద్ధి చేసుకోగలం’’ అని అన్నారు.
అభిక్ మిత్రా, మేనేజింగ్ డైరెక్టర్, స్పాటాన్ లాజిస్టిక్స్ మాట్లాడుతూ ‘‘ స్పాటాన్ బృందంతో పాటుగా నేను సైతం డెలివరీ యొక్క వృద్ధి, విలువ సృష్టిలో భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. అగ్రశ్రేణి ఎండ్ –టు–ఎండ్ లాజిస్టిక్స్ సృష్టించడంలో డెలివరీ టీమ్ అద్భుతంగా కృషి చేసింది. అతి తక్కువ సమయంలోనే భారతదేశంలో సరఫరా చైన్ సేవల కంపెనీగానూ దీనిని నిలిపారు. వినియోగదారులతో సంబంధాలను నెరపడం, సేవా నాణ్యత, వ్యక్తిగత నిర్వహణ, సాంకేతికత, ఇంజినీరింగ్‌పై దృష్టి సారించింది స్పాటన్. డెలివరీ సైతం ఇవే విలువలను పంచుకుంటుంది. అదే ఇప్పుడు ఈ రెండు కంపెనీలూ కలిసేందుకు, భారతదేశపు అగ్రగామి లాజిస్టిక్స్ కంపెనీగా నిలిచేందుకు తోడ్పడింది’’ అని అన్నారు.
‘‘మా ఖాతాదారుల వ్యాపారాలను ప్రజలు, సాంకేతికత, నెట్వర్క్, మౌలిక వసతులలో మా పెట్టుబడులు ద్వారా వృద్ధిచేసేందుకు స్ధిరంగా పెట్టుబడులను కొనసాగించనున్నాం. మా బృందాలు మరియు మా వ్యాపార భాగస్వాములకు మరింత పెద్ద సంస్ధలో భాగమయ్యే అవకాశం కల్పించడంతో పాటుగా వృద్ధికి గణనీయమైన అవకాశాలనూ అందించనున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
సందీప్ బరాసియా,బిజినెస్ ఆఫీసర్–డెలివరీ మాట్లాడుతూ ‘‘అత్యద్భుతమైన వ్యాపారం స్పాటాన్. అభిక్,అతని బృందం అత్యద్భుతంగా ఈ కంపెనీని నిర్మించారు. మొత్తం స్పాటాన్ బృందాన్ని డెలివరీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రెండు అత్యున్నత నాణ్యత కలిగిన కంపెనీలు ఏకీకృత విలువలతో ఒకే దరికి వచ్చాయి. మా సమ్మిళిత వ్యాప్తి మరియు సాంకేతికత, డాటాపై మా దృష్టి వంటివి మా వినియోగదారులకు నూతన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో అనుమతించడంతో పాటుగా సరుకు రవాణాకు సంబంధించి నూతన మార్గాలలో ప్రవేశించేందుకు సైతం అనుమతిస్తుంది’’అని అన్నారు. సమర క్యాపిటల్, ఎక్స్పోనెన్షియాలు 2018లో స్పాటాన్ను ఐఈపీ నుంచి సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లావాదేవీలో భాగంగా ఈ రెండు కంపెనీలూ తమ వాటాలను నగదుకు విక్రయించడం ద్వారా పూర్తిగా బయటకు వెళ్తున్నాయి.
కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ ఈ లావాదేవీకు ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌గా వ్యవహరిస్తే, శార్దూల్ అమరచంద్ మంగల్దాస్ అండ్ కో లీగల్ ఎడ్వైజర్లుగా డెలివరీకి ఈ లావాదేవీలో వ్యవహరించారు.