Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ‘అమేజాన్ పే ఫర్ బిజినెస్’ యాప్ కోసం వాయిస్ నోటిఫికేషన్ ఆరంభిస్తున్నట్లుగా అమేజాన్ పే నేడు ప్రకటించింది. ఈ ప్రారంభంతో, భారతదేశంవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారాలు అందుకున్న చెల్లింపులు కోసం తీరిక లేని రద్దీ వ్యాపార సమయంలో నోటిఫికేషన్స్ కోసం అదనపు నిముషాల్ని గడపటం నిర్మూలించబడి ఇబ్బందులు లేని అనుభవాన్ని ఆనందించవచ్చు. ఆరంభంలో, ఈ ఫీచర్ కేవలం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే లభిస్తుంది.
అమేజాన్ పే ఫర్ బిజినెస్ యాప్ చిన్న వ్యాపారులు తమ రోజూవారీ లావాదేవీల్ని నిర్వహించేలా మరియు డిజిటల్ చెల్లింపుల స్వీకరణని సరళతరమయ్యేలా చేస్తుంది. ఇది బహు-భాషా యాప్, దీనిని దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు డౌన్ లోడ్ చేయవచ్చు. ఒక వ్యాపారిగా తమని తాము నమోదు చేసుకున్న తరువాత సాధారణ స్టెప్స్ లో తాము ప్రాధాన్యతనిచ్చిన భాషని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆరంభం గురించి మాట్లాడుతూ, మహేంద్ర నెరూర్కర్, సీఈఓ-అమేజాన్ పే ఇండియా, ఇలా అన్నారు. “చెల్లింపులు విశ్వశనీయమైనవిగా, సౌకర్యవంతంగా, బహుమానపూర్వకంగా చేయడమే అమేజాన్ పే వారి లక్ష్యం. వ్యాపారులు కోసం వాయిస్ నోటిఫికేషన్ ఆరంభంతో, కస్టమర్లు నుండి అందుకున్న చెల్లింపుపై దుకాణదారులు, ఆఫ్ లైన్ వ్యాపారులు దృష్టి ఉంచేలా చేయడమే మా లక్ష్యం. వ్యాపారులు నోటిఫికేషన్స్ కోసం తమ ఫోన్ చూడటానికి బదులు, అమేజాన్ పే యాప్ అందుకున్న చెల్లింపుల్ని ఆడియో నిర్థారణ చేస్తుంది, తద్వారా వ్యాపారులు చెల్లింపులు తనిఖీ చేయడంలో తమ ఏకాగ్రతకు భంగం కలగకుండా కస్టమర్లకు సేవలు అందించవచ్చు.”
అమేజాన్ పే ఫర్ బిజినెస్ యాప్ వ్యాపారులు కోసం చెల్లింపుల స్వీకరాన్ని సరళతరం చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా కస్టమర్ ఇప్పుడు తమ ఫోన్స్ ని ఉపయోగించి ఏదైనా యూపీఐ యాప్ ని ఉపయోగించి అమేజాన్ పే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. వ్యాపారులకు వాస్తవిక సమయం ఆడియో నోటిఫికేషన్ మరియు అందుకున్న సొమ్ము యొక్క మొత్తం రూపం అందుతుంది. యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ పై లభిస్తోంది మరియు వ్యాపారాలు తమని తాము నమోదు చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. యాప్ పై ఒక విలక్షణమైన క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ ని ఉత్పన్నం చేయడం ద్వారా డిజిటల్ చెల్లింపుల స్వీకారాన్ని ఆరంభిస్తుంది. లావాదేవీలు స్వీకరించడం పై ఇది ఉత్తేజభరితమైన బహుమతుల్ని కూడా వ్యాపారులకు అందిస్తుంది.