Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా వ్యాధి తీవ్రత దీర్ఘకాలం కొనసాగుతుండటం, ఈ మహమ్మారికి నివారణ, చికిత్స చేయడంలో తగినంతగా విజయాలు లేకపోవడం చేత ప్రపంచమంతా గందరగోళంలో ఉంది. కొంతమంది నిపుణులు దీనిని బయోవార్ అంటున్నారు. అయితే ప్రకృతిలో సహజంగా తయారైన లేదంటే మనిషి సృష్టించిన ఈ తరహా వైరస్లు మహమ్మారులుగా మారతాయని ఎవరైనా ఊహించారా ? అంటే, ఎన్నో సంవత్సరాలకు పూర్వమే ఈ తరహా పరిస్థితులను ఊహించి, అందుకు విరుగుడు కనిపెట్టడానికి కృషి చేస్తున్న శాస్త్రవేత్త కె హెచ్ శాస్త్రి.
రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా గతంలో సేవలనందించిన ఆయన తన 35 సంవత్సరాల విస్తృత స్థాయి పరిశోధనల ఫలంగా, మనిషికి అత్యంత అనుకూలమైన ఉపకరణంను రూపొందించారు. వైరస్‌తో పోరాడేందుకు ఉపయోగపడే ఈ ఉపకరణాన్ని ప్యూర్ప్రాణ పేరిట విడుదల చేసింది ప్యూర్ ప్రొడక్ట్స్ అండ్ డివైజస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఆక్సిజన్ స్టెరిలైజర్, శ్వాససంబంధిత ఉపకరణం ప్యూర్ ప్రాణ. ఇది కోవిడ్ –19 సహా గాలి ద్వారా వ్యాప్తి చెందే అన్ని రకాల వైరస్లు, వ్యాధులతో పోరాడుతుంది. ప్యూర్ ప్రాణ ఉపకరణంలోని నానో సాంకేతికత, అయోనైజేషన్ ప్రక్రియల సహాయంతో వైరస్, బ్యాక్టీరియా పూర్తిగా నిర్వీర్యం చేయబడుతుంది. దీని వల్ల పూర్తి స్వచ్ఛమైన గాలిని తీసుకోవడమూ వీలవుతుంది.
మన దగ్గర ఇప్పుడు మహమ్మారి తరహా పరిస్థితులున్నాయి కానీ మనం దానిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాం. మన దగ్గర ఖచ్చితమైన టీకాలు ఉండి ఉండవచ్చు కానీ మనం వాటిని కనుగొనలేకపోతున్నాం. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సరైన ఉపకరణం ఉండాలి.అది ప్యూర్ ప్రాణ.