Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమ యాప్లో వాయిస్ నోటిఫికేషన్ను అందుబాటులోకి తెచ్చినట్లు అమేజాన్ పే వెల్లడించింది. దీంతో చిన్న వ్యాపారాలు అందుకున్న చెల్లింపుల మొత్తాన్ని ధ్వని రూపంలో వినడానికి వీలుందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో వచ్చిన మొత్తాన్ని ఫోన్లో తనిఖీ చేసుకునే అవసరం ఉండదని తెలిపింది. తొలుత ఈ ఫీచర్ కేవలం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే లభిస్తుందని తెలిపింది. చిన్న వ్యాపారులు తమ రోజూవారీ డిజిటల్ చెల్లింపుల స్వీకరణని సరళతరమయ్యేలా చేస్తుందని పేర్కొంది.