Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒప్పో ఇండియా నేడు మూడు డిజిటల్ చిత్రాలను పరిచయం చేసింది. తమ వినియోగదారులకు అమ్మకం తరువాత కూడా అత్యుత్తమ సేవలను అందిస్తామనే తమ నిబద్ధతను ప్రధానంగా వెల్లడిస్తూ శర్మ–వర్మ ఇతిహాసం ద్వారా ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది. సేవకు లోతైన అర్థం ఇస్తూ తీర్చిదిద్దిన ఈ మూడు డిజిటల్ చిత్రాలూ, ప్రతి రోజూ జీవితంలో ఎదురయ్యే విభిన్న పరిస్థితిలకు సముచితంగా అనుసంధానించబడి ఉంటూనే వినియోగదారుల జీవితాలలో సౌకర్యం, సౌలభ్యం యొక్క ప్రాముఖ్యతనూ వెల్లడిస్తాయి.
హవాస్ క్రియేటివ్ నేపథ్యీకరించిన ఈ ప్రచారం, తమ వీక్షకులను ఈ ద్వయం ద్వారా ఒప్పో స్టోర్‌కు తీసుకువెళ్లడం దగ్గర నుంచి అమ్మకం తరువాత సేవల అనుభవాలను ఆస్వాదించడం వరకూ విభిన్న అనుభూతుల ప్రయాణం చేయిస్తాయి. అదే సమయంలో మరమ్మత్తులు/తనిఖీ ప్రక్రియ ఎంత సులభమైనవి, ఆధారపడతగనివో కూడా చెబుతాయి. అతి చిన్న సంఘటనలలోని చమత్కారాన్ని ఒడిసిపట్టిన ఈ చిత్రాలు, ఒప్పో అందిస్తున్న అసాధారణ మరియు వేగవంతమైన అమ్మకం తరువాత సేవల విశిష్టతనూ వెల్లడిస్తాయి. ఉచిత తనిఖీ, 30 రోజుల రీప్లేస్మెంట్, వేగవంతమైన సేవలు, మరమ్మత్తులు వంటి ఫీచర్లను ప్రధానంగా వెల్లడిస్తూ తీర్చిదిద్దిన ఈ వీడియోలు, ఈ సేవల ప్రయోజనాలను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శిస్తాయి.
ఈ టీవీసీ ఆవిష్కరణ సందర్భంగా దమయంత్ సింగ్ ఖనోరియా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఒప్పో ఇండియా మాట్లాడుతూ ‘‘ఒప్పో వద్ద మేము చేసే ప్రతి అంశంలోనూ వినియోగదారులే కీలకంగా ఉంటారు. ఈ ప్రచార చిత్రాలు బ్రాండ్ యొక్క వినియోగదారులే ముందు విధానాన్ని ప్రదర్శిస్తాయి. అదే సమయంలో సూక్ష్మ అంశాల పట్ల కూడా బ్రాండ్ తీసుకునే శ్రద్ధ, వేగవంతమైన పరిష్కారాలు వంటివి మా వినియోగదారులకు ఎప్పుడూ ఆదర్శవంతమైన సేవలను పొందడంలో సహాయపడతాయి. ఒప్పో మరింతగా వినియోగదారులకు చేరువయ్యేందుకు, అమ్మకం తరువాత సేవలను మరింత మెరుగ్గా అందించడంలో మాకు అవిశ్రాంతంగా మద్దతునందిస్తున్న మా భాగస్వాములకు ధన్యవాదములు తెలుపుతున్నాం’’ అని అన్నారు.
బాబీ పవార్, ఛైర్మన్ అండ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, హవాస్ గ్రూప్ ఇండియా మాట్లాడుతూ ‘‘అమ్మకం తరువాత సేవలనేవి వ్యాపారంలో అత్యంత కీలకమైనవి. కానీ, మీరు సేవా కేంద్రాల వద్దకు వచ్చే వినియోగదారులను పరిశీలించినట్లయితే సిల్లీగా అనిపించే అంశాలు మొదలు దురదృష్టకరమనిపించే అంశాల వరకూ ఎన్నో కనిపిస్తాయి. ఎలాంటి సంఘటన అయినా మీ ఫోన్‌ను కాపాడేందుకు తగిన ప్రయత్నాలను చేస్తున్న ఒప్పో వద్ద సేవా ప్రతినిధులకు ధన్యవాదములు చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రకటనలన్నీ కూడా వినోదాత్మకంగా ఆరంభమై, నెమ్మదిగా అతి ముఖ్యమైన అంశాల వైపు తీసుకు వెళ్లి, ఒప్పో తమ వినియోగదారులకు చేసిన వాగ్ధానాన్ని ప్రదర్శిస్తాయి. నిజానికి ఈ వాగ్ధానాలనే మేము ప్రేక్షకులకు ఆకట్టుకునే రీతిలో చెప్పాలనుకున్నాం. మీ ఫోన్‌పైకి జీవితం ఏం విసిరినా, దానిని చూసుకోవడానికి ఒప్పో ఉంది’’ అని అన్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా ఒప్పో తమ వినియోగదారుల నుంచి అందుకుంటున్న అత్యున్నత శ్రేణి వినియోగదారుల సంతృప్తికి అనుగుణంగా ఈ ప్రచారం ఉంటుంది. అసాధారణ సేవలతో ఈ బ్రాండ్, వినియోగదారుల జీవితాలను సమృద్ధి చేయడం కొనసాగిస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం 500కు పైగా సేవా కేంద్రాలను 500కు పైగా నగరాలలో నిర్వహిస్తుంది. తద్వారా అమ్మకం తరువాత సేవలలో బ్రాండ్ యొక్క ప్రీమియం అనుభవాలను అందిస్తుంది. తమ వినియోగదారులకు సమగ్రమైన వినియోగదారుల సేవా అనుభవాలను అందించడానికి ఒప్పో ప్రయత్నిస్తుంది.
కౌంటర్ పాయింట్ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో, అమ్మకం తరువాత సేవా అనుభవాల పరంగా నెంబర్ 1 స్ధానంలో ఒప్పో ఉంది. దాదాపు 93% మంది స్పందనదారులు తమ అనుభవాలను ‘చాలా బాగున్నాయి’ లేదా ‘అసాధారణం’గా వెల్లడించారు. అదనంగా, ఒప్పో వద్ద వినియోగదారులు అతి తక్కువ నిరీక్షణ సమయం నమోదు చేశారు. స్పందనదారులలో దాదాపు సగం మంది తాము వినియోగదారుల సేవా కేంద్రానికి వచ్చిన 15 నిమిషాలలోనే తమ పని ముగించుకోవడం జరిగిందని వెల్లడించారు. వినియోగదారుల సేవా మద్దతు పరంగా అగ్రగామిగా ఒప్పో వెలుగొందుతుంది. వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారానే చాలామంది వినియోగదారులు తమ స్టేటస్ అప్డేట్స్ పొందుతున్నారు. అధ్యయనం ప్రకారం, అమ్మకం తరువాత సేవల డెలివరీలో అత్యంత వేగవంతమైన టర్న్ ఎరౌండ్ సమయం ఒప్పో నమోదు చేయడంతో పాటుగా ఆధునీకరించిన ఇన్వెంటరీలనూ నిర్వహిస్తుంది.
ఒప్పో ఇండియా ఇప్పుడు పూర్తిగా అంకితం చేసిన ఏఐ శక్తివంతమైన చాట్‌బాట్‌ను ‘ఓలీ’ శీర్షికన పరిచయం చేసింది. ఇది 24 గంటలూ లభ్యం కావడంతో పాటుగా 94.5% వరకూ వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తుంది. రెనో కోసం ప్రత్యేకంగా ప్లాటినమ్ కేర్ హాట్‌లైన్ సైతం అందుబాటులో ఉంది. 365 రోజులూ 24 గంటలూ హిందీ, ఇంగ్లీష్ భాషలలో వినియోగదారులు దీనిని చేరుకోవచ్చు. ఇది వినియోగదారుల సందేహాలు, ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారాలను అందిస్తుంది.