Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐఈఎక్స్ గ్రీన్ మార్కెట్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఎక్స్చేంజ్ తన గ్రీన్ టర్మ్అహెడ్ మార్కెట్ తన మొదటి సంవత్సరంలో 2744 ఎంయూ పునరుత్పాదక శక్తిని సోలార్ విభాగంలో 1267 ఎంయూ వాల్యూమ్, నాన్-సోలార్ సెగ్మెంట్లో 1477 ఎంయూని వాణిజ్యం చేసింది. విద్యుత్, కొత్త అండ్ పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్
కె సింగ్ గతేడాది సెప్టెంబర్ 1న అధికారికంగా ప్రారంభించారు. పీసీకేఎల్ చైర్మన్, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ, కర్ణాటక ప్రభుత్వం జి.కుమార్ నాయక్ మాట్లాడుతూ... కర్ణాటక రాష్ట్రం పునరుత్పాదక - 15జీ డబ్ల్యూ వ్యవస్థాపిత సామర్థ్య స్థావరం, అమలులో ఉన్న మరో 9 జీడబ్ల్యూ గ్రీన్ సామర్థంతో ధనిక రా ఫ్రంగా గర్వించదగిన ఆధారాలను కలిగి ఉందన్నారు. తెలం గాణ ట్రాన్స్ కం. జా యింట్ మేనేజింగ్ డైరెక్టర్ సి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 'తెలంగాణ డిస్కంలు సెప్టెంబర్ 2020 నుండి జూలై 2021 వరకు 797 ఎంయూ సౌరశక్తిని విక్రయిం చాయన్నారు. ఇది ఆర్థిక ద్రవ్యతను నిర్ధారించడంలో రాష్ట్రానికి సహాయపడింది' అని అన్నారు. ఐఈఎక్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్.గోయల్ మాట్లాడుతూ 'గ్రీన్ మార్కెట్ ప్రారంభం మన దేశానికి మైలురాయిగా నిలిచిందన్నారు. ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి 2047 సంవత్సరం వరకు భారతదేశం శక్తి స్వాతంత్ర్యాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు' ప్రకటించారన్నారు.