Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కెనాన్ ఇండియా కొత్తగా ఇమేజ్ప్రెస్, ఇమేజ్ప్రోగ్రాఫ్ సిరీస్ నూతన శ్రేణి ప్రింటింగ్ ఉత్పత్తులను ఆవిష్కరించినట్టు తెలిపింది. ఇమేజ్ ప్రెస్ సీ10010వీపీ, ఇమేజ్ప్రెస్ సీ9010వీపీ, ఇమేజ్ప్రోగ్రాఫ్ టిజడ్ 5300, ఇమేజ్ప్రోగ్రాఫ్ టీఎక్స్ 5410 ప్రింటింగ్ మిషన్లను విడుదల చేసినట్టు పేర్కొంది. వైవిధ్యమైన ప్రింటింగ్ కార్యకలాపాలకు మద్దతునందించే రీతిలో వీటిని తీర్చిదిద్దినట్టు పేర్కొంది. బ్రోచర్లు, బిజినెస్ కార్డులు, సైనేజ్‌లు, రెస్టారెంట్ మెనూలను సైతం వీటితో సులభంగా ముద్రించుకోవచ్చని తెలిపింది.