Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రిఫైనరీల సామర్థ్యం పెంపునకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఆ సంస్థ ఛైర్మన్ శ్రీకాంత్ మాదవ్ తెలిపారు. ఇంధన డిమాండ్‌ను చేరడానికి వచ్చే 4-5 ఏళ్లలో ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నామని వెల్లడించారు. ఐఒసి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా ముందు నాటి స్థాయికి పెట్రోల్ డిమాండ్ చేరుకుందన్నారు. అత్యధికంగా ఉపయోగించే డీజిల్ వినిమయం దీపావళి కల్లా పుంజుకోనుందన్నారు. 2040 కల్లా దేశంలో ఇంధన డిమాండ్ 400 -500 మిలియన్ టన్నులకు చేరనుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఇది 250 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. ప్రస్తుతం ఐఒసి రిఫైనరీ సామర్థ్యం ఏడాదికి 81.2 మిలియన్ టన్నులుగా ఉందని.. నూతన పెట్టుబడులు సామర్థ్యం పెంపు వల్ల 106.7 మిలియన్ టన్నులకు చేరనుందన్నారు.