Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో గల టెట్రా గ్లోబల్ అనుబంధ సంస్థ టెట్రా మెడ్సైన్సెస్ హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివద్ధి కార్యకలాపా లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కంపెనీ కొత్త మాలిక్యూల్‌ను అభివద్ధి చేయడంతో పాటు రాబోయే 5-10 ఏళ్లకు అవసరమైన మాలిక్యూల్స్ పోర్ట్ఫోలి యోను రూపొందించడంపై దష్టి పెట్టనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ సునీతా ఎయున్ని తెలిపారు. రాబయే 5-10 ఏళ్లలో యాక్టివ్ ఫార్మా ఇన్గ్రెడియంట్ల (ఎపిఐ) కోసం మాలిక్యూల్స్, వాటి ఇంటర్మీడియట్లను రూపొందించి, పేటెంట్లు అవసరం లేకుండా చేయాలన్నదే సంస్థ లక్ష్యమన్నారు. ''కరోనా దెబ్బతో ఔషధ పరిశ్రమలో సరఫరాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి. ఎపిఐల కోసం చైనామీద ఎక్కువగా ఆధారపడటమే ఇందుకు కారణం. మాలిక్యూల్స్ అభివద్ధి, ఔషధాల ఫార్ములేషన్లు అనేది భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలు అయ్యింది. దేశంలో ఫార్మా హబ్ అయిన హైదరాబాద్‌లోని మా కొత్త పరిశోధన, అభివద్ధి కేంద్రం.. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ విజన్‌కు కట్టుబడి ఉండటంలో ఓ కీలక ముందడుగు'' అని సునీతా పేర్కొన్నారు.