Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో లీడింగ్ డీటీహెచ్ ఆపరేటేర్ అనగానే అందరికి గుర్తుకువచ్చేది టాటా స్కై. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఉత్పత్తుల్ని మరియు కార్యక్రమాలను అందిస్తున్న టాటా స్కై… సెట్ అప్ బాక్సులను స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే రూపొందించుకుంటాని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా వాగ్దానం చేసింది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ… 2021 ఆర్ధిక సంవత్సరంలోనే టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ మరియు ఫ్లెక్స్ ట్రానిక్స్ తో కలిసి సెట్ అప్ బాక్సులను రూపొందించి ఇప్పుడు వాటిని మార్కెట్లో కూడా విడుదల చేసింది.
ఈ సందర్బంగా టాటా స్కై ఎండీ,సీఈఓ హరిత్ నాగపాల్ మాట్లాడుతూ… మన దేశంలో సెట్-టాప్ బాక్స్‌లు తయారుచేయడం వల్ల మనకు చాలా టైమ్ ఆదా అవుతుంది. అంతేకాకుండా మనవారికి ఉపాధిని కూడా కల్పించినట్లు అవుతుంది. ఇక నాణ్యత విషయంలో మేం ఎక్కడా రాజీపడలేదు. సెట్ బాక్సులు ఫ్యాక్టరీ దాటేలోపు ఒకటికి రెండు సార్లు పరీక్షించారు. అన్నీ బాగున్నాయి అన్న తర్వాతే సెట్ బాక్స్ లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఇప్పుడు మేం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి మాకు వీలు కలుగుతుందని భావిస్తున్నాం అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల (ఎన్ఎస్పి) కోసం సెట్-టాప్ బాక్స్‌లు, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ ప్రొవైడర్ సంస్థ టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ మరియు టాటా స్కై మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది. "ఈ కొత్త ప్రాజెక్టు సాధ్యం కావడం ద్వారా 2020 ఆగష్టులో ప్రకటించిన లక్ష్యాలను మేం అందుకున్నట్లు భావించాలి. ఇందులో ప్రధానంగా టాటా స్కై, టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ ఎస్‌టిబిల ఉత్పత్తి , పంపిణీని మార్చడానికి ద్వారా భారతదేశం మొత్తం ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత బింజ్+ సెట్-టాప్ బాక్స్‌కి మార్చినట్లు అవుతుంది. భారతీయ మార్కెట్ వృద్ధిలో టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ యొక్క నిరంతర పెట్టుబడులలో ఇది మరో మెట్టు అని అన్నారు టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ అధ్యక్షుడు లూయిస్ మార్టినెజ్ అమాగో. టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ ద్వారా టాటా స్కై కోసం డెవలప్ చేయబడిన సెట్-టాప్ బాక్స్‌ల భారీ ఉత్పత్తి ఫ్లెక్స్‌ట్రానిక్స్ భాగస్వామ్యంతో జూన్ 2021 లో చెన్నైలో ప్రారంభమైంది. టెక్నికల్ కనెక్టెడ్ హోమ్ టాటా స్కైని అందించడానికి తన బెస్ట్ ఇన్ క్లాస్ సప్లై చెయిన్‌ని అందిస్తోంది. దీనిద్వారా భారతీయ మార్కెట్లో వినియోగదారుల కోసం మెరుగైన సేవలు, పరికరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు వీలు కలుగుతుంది.
"కోవిడ్ -19 వల్ల కలిగిన ఇబ్బందులు, అంతరాయాలు... వినియోగదారులకు సాధ్యమైనంత దగ్గరగా ఉండే అవసరాన్ని మరింతగా పెంచాయి. టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ మరియు టాటా స్కై ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉంది. దీనిద్వారా STB విస్తరణ క్రమంలో నష్టాలను మరియు మొత్తం వ్యయాన్ని తగ్గించుకోవచ్చు అని అన్నారు టెక్నికలర్ కనెక్టెడ్ హోమ్ అధ్యక్షుడు లూయిస్ మార్టినెజ్ అమాగో.