Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు అత్యవసర ఆదేశాలను అమలు చేస్తే సంస్థలోని 35,575 మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పిటిషన్ రూపంలో శనివారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనం అంశం అమెజాన్‌తో చేసుకున్న ఒప్పందానికి విరుద్దంగా ఉందని సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా ఇది వరకు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ కేసును పున పరిశీలించాలని తాజాగా ప్యూచర్ గ్రూపు అత్యున్నత న్యాయస్థానికి పిటిషన్ దాఖలు చేసింది.