Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 765 పాయింట్ల ర్యాలీ
- మదుపర్లకు రూ.4 లక్షల కోట్ల సంపద
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన గరిష్టాలతో సరికొత్త మైలురాళ్లను నమోదు చేస్తోన్నాయి. సోమవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 57వేల మార్క్‌ను తాకి నూతన గరిష్టాలను చేరింది. తుదకు 765 పాయింట్లు లాభపడి 56,890 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 226 పాయింట్లు రాణించి 16,931 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.7 శాతం, 1.5 శాతం చొప్పున రాణించాయి. లోహ సూచీ అత్యధికంగా 2.5 శాతం పెరగ్గా.. ఆ తర్వాత స్థానాల్లో రియాల్టీ, ఫార్మా, బ్యాంకింగ్ సూచీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలోపేతం కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. దేశీయ మార్కెట్లోకి రూ.1.28 లక్షల కోట్ల ఎఫ్‌డిఐల రాక, వ్యాక్సినేషన్‌తో తగ్గిన కరోనా మహమ్మారి భయం, జిడిపి, వాహన అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాల మధ్య సూచీలు లాభపడ్డాయి. బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.247.34 లక్షల కోట్లు దాటింది. 435 స్క్రిప్ట్‌లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. 211 షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకగా, 32 స్క్రిప్టులు 52 వారాల కనిష్టాన్ని తాకాయి.