Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నగదు చెల్లింపుల వేదిక ఫోన్‌పే కొత్తగా బీమా బ్రోకింగ్ లైసెన్స్ పొందినట్లు తెలిపింది. జీవిత బీమా, సాధారణ బీమా ఉత్పత్తులను ప్రత్యక్ష ఏజెంట్‌గా విక్రయించడానికి ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎ) అనుమతించింది. 2020లోనే ఈ సంస్థకు ఇన్సూరెన్స్ కార్పోరేట్ ఎజెంట్‌గా పరిమిత లైసెన్స్ పొందింది. తాజా అనుమతులు తమ సంస్థ బీమా రంగ ప్రయాణంలో కీలక మైలురాయి అని ఫోన్‌పే ఇన్సూరెన్స్ హెడ్ గుంజన్ గారు పేర్కొన్నారు. దీంతో తమ వినియోగదారుల అన్ని రకాల బీమా అవసరాలు ఒకే చోట తీరనున్నాయన్నారు.