Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్
న్యూఢిల్లీ : మోబైల్ టారీఫ్ల పెంపునకు తమ కంపెనీ సిగ్గుపడేదేమీ లేదని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. రూ.100 ఆదాయం వస్తే అందులో ప్రభుత్వానికి పలు రూపాల్లో 30 శాతం పన్నులు చెల్లించాల్సి వస్తోందన్నారు. తమ ప్రయత్నం తాము చేస్తున్నామని, పరిశ్రమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందన్నారు. రైట్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ఇన్వెస్టర్లతో మాట్లాడారు. రూ.535 ధరతో ఈ షేర్లు కేటాయించబ డతాయన్నారు. ఈ నిధులతో భారత టెలికంలో మరింత పోటీ పడటానికి వీలుపడుతుందన్నారు. సరైన సమయంలో ఆస్తుల నగధీకరణ కూడా చేపడతామమన్నారు. కంపెనీలో ప్రమోటర్లు ప్రస్తుతం 55.8 శాతం, పబ్లిక్ 44.09 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నారు. గడిచిన జూన్లో కొత్తగా 38 లక్షల మంది తమ నెట్వర్క్లో చేరడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 35.2 కోట్లకు చేరిందని మిట్టల్ తెలిపారు. సోమవారం బిఎస్ఇలో ఈ కంపెనీ షేర్ 4.44 శాతం పెరిగి రూ.620.35 వద్ద ముగిసింది.