Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరబాద్: అలెక్స్ రూథర్‌ఫోర్డ్ రాసిన ది ఎంపైర్ ఆఫ్ ది మొఘల్: రైడర్స్ ఫ్రమ్ ది నార్త్ పేజీల్లో ఒక యువ రాజు కథ ఉంటుంది. భారతదేశంలోని అతిపెద్ద వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారాల్లో ఒకటైన డిస్నీ+ హాట్‌స్టార్, ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్కు చెందిన నిఖిల్ అద్వానీతో కలిసి భారతదేశంలో నిర్మించిన అతి పెద్ద షో, ది ఎంపైర్-ఏ ఫిక్షన్ సాగా ఆఫ్ ఏ వారియర్-టర్న్డ్ కింగ్‌ను విడుదల చేసింది. భారతదేశంలో అత్యుత్తమ ప్రతిభ, అద్భుతమైన విజువల్స్ మరియు చక్కని పట్టు ఉన్న కథనాన్ని ఒకదానితో మరొకటి పోటీ పడే స్థాయిలో, డిస్నీ+ హాట్‌స్టార్ తన చందాదారులు అందరి కోసం హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పణలో ది ఎంపైర్ విడుదలై ప్రసారమవుతోంది. షో తర్వాత తాను ఇప్పుడు పుస్తకాలను చదవడం ఎలా ప్రారంభించాను అనే విషయం గురించి నటి ద్రష్టి ధామి మాట్లాడుతూ ‘‘నేను నా పాత్ర, షో లేదా పుస్తకం కోసం ఎప్పుడూ చదవలేదు. నా డిక్షన్ టీచర్ దాన్ని నాకు చదివి వినిపించేవారు. నేను అంత పెద్దగా చదవను. కానీ, ఇప్పుడు నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను. చదవడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని నేను భావించడంతో, ప్రస్తుతం పిల్లల కథల పుస్తకాలను చదవడాన్ని ప్రారంభించాను. ఎందుకంటే సెట్లోని ఇతర వ్యక్తులు చెప్పే వాటి నుంచి నేను పలు విషయాల తెలుసుకుంటున్నాను. కానీ నేను దాని గురించి ఎప్పుడూ చదవలేదు. నేను నా లైన్లను మాత్రమే బాగా చదుకున్నాను’’ అని తెలిపారు.