Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీదారు టాటా మోటార్స్ భారత్ మార్కెట్లోకి అద్బుత ఫీచర్లతో టిగోర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది. బిఎస్6 టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడన్‌కు అనుగుణంగా న్యూ టిగోర్ ఇవిలో మార్పులు చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ వాహనం 306 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వెల్లడించింది. కేవలం 5.7 సెకండ్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుందని తెలిపింది. రూ.21,000తో దీన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.