Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రైతులకు సరైన సమయానికి సలహా ఇవ్వడానికి మరియు తమ పంటలకు అవసరమైన చర్యలు పై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మెరుగైన ఉత్పత్తి కోసం మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని పరిచయం చేయడానికి మరియు దృఢమైన సరఫరా చెయిన్ మౌలిక సదుపాయం కోసం ఒక చొరవ ద్వారా రైతులకు సాధికారత కల్పించడానికి అమేజాన్ రీటైల్ అగ్రోనోమి సేవల్ని ఆరంభిస్తున్నట్లు ప్రకటించింది.
సమీర్ ఖెతర్ పల్, డైరక్టర్, గ్రాసరీ, ఫుడ్ అండ్ హెల్త్, అమేజాన్ ఇండియా ఇలా న్నారు, "పండ్లు, కూరగాయలు యొక్క నాణ్యత, పంట దిగుబడిని మెరుగుపరిచే కొత్త ఆలోచనల టెక్నాలజీ ద్వారా భారతదేశపు రైతులు మరియు వ్యవసాయ వర్గానికి సాధికారత కలిగించడంలో మా బాధ్యతతో మేము ఉత్తేజభరితులయ్యాము. మట్టి మరియు వాతావరణం పరిస్థితులు పై ఆధారపడిన శాస్త్రీయమైన పంట ప్రణాళికని ఉపయోగించడానికి రైతుల్ని సమర్థవంతుల్ని చేసే, పంట గురించి అంశాలు, వ్యాధి నిర్వహణని కేటాయించే సమగ్రమైన కార్యక్రమం ఇది. రైతులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో , పంట దిగుబడులు మరియు పొలం ఉత్పాదకత పై తక్షణమే ఫలితాలు చూడటంలో వారికి సహాయపడే టెక్ నేతృత్వంలోని సరళమైన పరిష్కారాలు అనుసరించడానికి, నేర్చుకోవడానికి రైతులు అంగీకరించడంతో మేము సవినయంగా ఉన్నాము. కార్యక్రమాన్ని నిరంతరం సమర్థవంతంగా మెరుగుపరచడానికి, భారతదేశపు రైతులకు ప్రయోజనాన్ని కొనసాగించే కొత్త మాడ్యూల్స్ ని సృష్టించడానికి మేము ప్రణాళిక చేస్తున్నాము."
అగ్రోనోమి సర్వీస్ ప్రారంభోత్సవంలో భాగంగా, అగ్రోనోమిస్ట్ ప్రోత్సహించిన క్షేత్ర జోక్యాలు, జోక్యాల ప్రభావాన్ని పర్యవేక్షించడానికి పొలం నిర్వహణ సాధనం కలయిక ద్వారా ఒక పర్యావరణ వ్యవస్థని అమేజాన్ రీటైల్ రూపొందించింది. రైతులకు అవసరమైన మరియు విలువనిచ్చే సరైన సమయపు జోక్యాన్ని కేటాయించడానికి సాగు నిర్వహణ సాధనం పై నమోదు చేయబడిన ప్రతీ రైతు భాగస్వామి ఉంటాడు. మెరుగైన పొలం దిగుబడి, మెరుగుపరచబడిన ఉత్పత్తి నాణ్యత కోసం నమోదు చేయబడిన రైతు భాగస్వాములకు అర్హత కలిగిన అగ్రోనోమిస్ట్స్ బృందం అగ్రిటెక్ నైపుణ్యతని అందిస్తుంది. దీనితో పాటు, అగ్రోనోమిస్ట్స్ సమగ్రమైన, శాస్త్రీయమైన మరియు ఖచ్చితమైన సలహాని రైతులకు ఇస్తారు. కార్యక్రమంలో ప్రతిచర్యాత్మక మరియు ముందస్తు పంట ప్రణాళికలు ఉంటాయి: ముందస్తు పంట ప్రణాళిక శాస్త్రీయమైన పంట, మట్టి నిర్వహణ పద్ధతులు పై ఆధారపడింది. మెరుగైన దిగుబడి, నాణ్యతని పొందే లక్ష్యాన్ని కలిగి ఉంది; ప్రతచర్యాత్మకమైన ప్రణాళిక అనగా జోక్యం ఆధారిత చొరవ, దీనిలో రైతులు తెగుళ్లు, వ్యాధులు మొదలైన వాటి పై అప్రమత్తతలు ప్రతిపాదించవచ్చు. తమ పొలం సమస్యలు కోసం పరిష్కారాలు పొందవచ్చు. అవసరమైనప్పుడల్లా ప్రతిచర్యాత్మక పంటకు సంబంధించిన సందేహాలు ప్రతిపాదించి, పరిష్కారాల్ని పొందే సామర్థ్యంతో ప్రస్తుతం, మాతో చేరిన 80% రైతులకు తమ మొబైల్ యాప్ లో వ్యక్తిగత పంట ప్రణాళిక అందుబాటులో ఉంది.
సప్లై చెయిన్ ప్రక్రియల్ని సరళం చేసి, పండ్లు, కూరగాయలలో లోపాల్ని (కుళ్లు, మచ్చలు, కోతలు , బూజు) గుర్తించడానికి రైతులకు సహాయపడి, ఉత్పత్తి యొక్క వ్యర్థాన్ని తగ్గించే కంప్యూటర్ -విజన్ ఆధారిత అల్ గోరిథమ్స్ మరియు మెషిన్ లెర్నింగ్ ద్వారా అప్లికేషన్ -ఇంటర్ ఫేస్ అనేది అమేజాన్ రీటైల్ అగ్రోనోమి సర్వీసెస్ యొక్క రెండవ ఆఫర్. ఇది కస్టమర్లు ఉత్తమమైన నాణ్యత గల పండ్లు, కూరగాయలు పొందేలా నిర్థారించడంలో సహాయపడుతుంది.
కుచించుకుపోవడాన్ని తగ్గించి, కస్టమర్లకు తాజా నాణ్యతని కేటాయించే దృఢమైన ఉష్ణోగ్రత నియంత్రిత సరఫరా చెయిన్ మౌలిక సదుపాయాన్ని రూపొందించడానికి ఆధునిక సాంకేతికతని సమతుల్యం చేయడానికి అమేజాన్ రీటైల్ పెట్టుబడి పెడుతోంది. రైతులు నుండి ఉత్పత్తిని సంపాదించి మరియు ప్రాసెసింగ్ కేంద్రాలకు పంపించిన తరువాత బహుళ దశలలో నాణ్యతని తనిఖీ చేసి మరియు పర్యవేక్షించడానికి అమేజాన్ రీటైల్ అసోసియేట్స్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. తాజా ఉత్పత్తి (పండ్లు మరియు కూరగాయలు) తదుపరి ప్రాసెసింగ్ కేంద్రాలలో వేరు చేయబడి, గ్రేడ్ చేయబడి, వివిధ సైజ్ లలో ప్యాక్ చేయబడతాయి మరియు కస్టమర్లకు దగ్గరగా ఉన్న అమేజాన్ ఫ్రెష్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలకు పంపిణీ చేయబడతాయి. ఉత్పత్తి నాణ్యత మరియు తాజాదనం నిర్వహించడానికి ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు 4 వేరు ఉష్ణోగ్రత జోన్లతో (పరిసర,ట్రాపికల్, శీతల మరియు ఫ్రోజెన్) పని చేస్తాయి.
అమేజాన్ రీటైల్ నుండి అగ్రోనోమి సర్వీస్ ని ఉపయోగించిన మంజర్ వాడి, ఎంహెచ్ కి చెందిన రైతు దర్శన్ దౌలత్ ఖండగ్లే ఇలా అన్నారు, “కాలీఫ్లవర్ కోసం నేను అమేజాన్ నుండి అగ్రోనోమీ సర్వీసెస్ లో నమోదయ్యాను. మార్గదర్శకత్వం కోసం నేను అర్హులైన నిపుణుడి నుండి క్రమబద్ధంగా సందర్శనలు పొందుతున్నాను. నా యాప్ లో కూడా నేను వృద్ధి చేసే ప్రణాళిక (గ్రోయింగ్ ప్లాన్) పొందాను. పొలంలో ఏదైనా అసాధారణ పరిస్థితిని గమనిస్తే వెంటనే నేను అప్రమత్తం చేస్తున్నాను. సరైన సమయంలో, సరైన చర్యలు తీసుకోవడం వలన గత సీజన్ లో నా పంట నాణ్యత మెరుగుపడింది మరియు నేను మరింత సంపాదించడానికి సహాయపడింది.' ఈ దశాబ్దంలో వ్యవసాయాన్ని సమర్థవంతం చేయడంలో టెక్నాలజీ కీలకమైన బాధ్యతవహించింది. రైతులకు వ్యవసాయ ఫలితాల్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి వారికి తమ ఉత్తమమైన అగ్రిటెక్ సామర్థ్యాలు అందుబాటులో ఉండేలా అమేజాన్ రీటైల్ కట్టుబడింది. నాణ్యత, విలువ, సౌకర్యం ద్వారా కస్టమర్లకు సేవలు అందించడానికి అమేజాన్ రీటైల్ కొనసాగుతుంది.