Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కంఫర్ట్ టెక్నాలజీ కంపెనీ, స్కెచర్స్ నేడు తమ పూర్తి సరికొత్త గోరన్ రేజర్ ఎక్సెస్‌ను పురుషుల కోసం ఆవిష్కరించినట్టు వెల్లడించింది. అమిత ప్రజాదరణ పొందిన, అవార్డులు గెలుచుకున్న గోరన్ రేజర్ 3 ఆధారంగా దీనిని తీర్చిదిద్దారు. తేలికపాటి, అత్యధిక కుషనింగ్ కలిగిన ఈ రన్నింగ్ షూ, స్కెచర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ గో రన్ శ్రేణికి తాజా జోడింపు. అత్యుత్తమ రన్నింగ్ అనుభవాలను అందించడం కోసం రూపొందించిన ట్రైనర్స్, రేస్ డే షూస్‌ను అత్యాధునిక సాంకేతికతలతో తీర్చిదిద్దారు. ఇది మెరుగైన సౌకర్యం, స్పందన, మన్నికను అందిస్తుంది. భారతదేశంలో రన్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. మరింత దూరం పరుగుపెట్టాలని కోరుకుంటున్న వారి కోసం అత్యున్నత పనితీరు కలిగిన సాంకేతికత, ట్రేడ్‌మార్క్ సౌకర్యం మిళితం చేసి స్కెచర్స్ ఇండియా ఈ షూస్‌ను అందిస్తుంది.
విభిన్న తరహా రన్నర్స్ కోసం రూపకల్పన చేసిన స్కెచర్స్ గోరన్ రేజర్ ఎక్సెస్, పూర్తి తేలికగా ఉంటూనే సుదీర్ఘకాలం పాటు నిలిచి ఉండే హైపర్ బరస్ట్ కుషనింగ్, మెరుగైన ట్రాక్షన్, స్థిరత్వం, మన్నిక కోసం గుడ్ఇయర్ రబ్బర్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. బొటనవేలు వద్ద ఈ షూస్ అంతర్గతంగా మద్దతును కలిగి ఉండటంతో పాటుగా స్కెచర్స్ హైపర్ఆర్క్ రాకర్ బాటమ్ డిజైన్‌ను సైతం కలిగి ఉంటుంది. సన్నని, సాగదీయగల లేసులు నడుస్తున్నప్పుడు విస్తరిస్తాయి మరియు పరుగుపెట్టినప్పుడు కుచించుకుపోతాయి. తద్వారా అనుకూలమైన ఫిట్‌ను అందిస్తాయి. అధిక పనితీరుతో సౌందర్యాన్ని మిళితం చేసుకున్న రేజర్ ఎక్సెస్‌ను నియాన్ గ్రాఫిక్ ప్రింట్స్ మరియు రిఫ్లెక్టివ్ డిటైల్తో రాత్రిపూట పరుగులు పెట్టే వారి కోసం చక్కగా రూపొందించారు.
ఈ కలెక్షన్ ఆవిష్కరణ గురించి స్కెచర్స్ సీఈఓ రాహుల్ విరా మాట్లాడుతూ ‘‘ఔత్సాహిక రన్నర్ల పరంగా భారతదేశం అతి పెద్ద మార్కెట్‌గా ఎప్పుడూ నిలుస్తూనే ఉంటుంది. వాకింగ్ లేదా రన్నింగ్ ఏదైనా సరే, మా ఉత్పత్తుల ద్వారా అత్యున్నత సౌకర్యపు అనుభవాలను అందించడాన్ని స్కెచర్స్ విశ్వసిస్తుంది. స్కెచర్స్ గోరన్ రేజర్ ఎక్సెస్‌తో, ఎక్కువ దూరం పరుగులు పెట్టాలనుకునే వినియోగదారుల అవసరాలను మేము తీర్చాలనుకుంటున్నాం. మా తాజా కలెక్షన్లో అత్యుత్తమ పరుగు అనుభవాలను అందించడం కోసం అవసరమైన సాంకేతికతలన్నీ ఉన్నాయి’’ అని అన్నారు. స్కెచర్స్ గోరన్ రేజర్ ఎక్సెస్ ఇప్పుడు 9999 రూపాయల ప్రారంభ ధరలో Skechers.in, స్కెచర్స్ రిటైల్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది.