Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8,000 ప్రత్యక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: 140 అమెజాన్ రిక్రూటర్లు, 2000కు పైచిలుకు అభ్యర్థులకు అభ్యర్థులకు ఒన్-ఆన్-ఒన్ కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కంపెనీ లేదా ఇతర ప్రాంతాల్లో వారి వృత్తిని మెరుగుపరుచుకునేందుకు మద్ధతు ఇవ్వనున్నారు. సెప్టెంబరు 16న తన మొదటి కెరీర్ డేను భారతదేశంలో నిర్వహిస్తున్నట్లు అమెజాన్ నేడు ప్రకటించింది. ఈ వర్చ్యువల్, కమ్యూనికేషన్ కార్యక్రమం అమెజాన్‌లో లీడర్లు మరియు ఉద్యోగులను అమెజాన్‌లో పని చేసేందుకు ఉత్సాహకరమైన స్థలంగా ఎలా మార్చిందో మరియు భారతదేశానికి 21వ శతాబ్దంలో తన వాస్తవ సామర్థ్యాన్ని కనుగొనేందుకు కంపెనీ తన నిబద్ధతలో ఎంత మేర, ఎలా సదృఢంగా ఉందో చాటిచెప్పనుంది.
అమెజాన్ దేశంలో 35 కన్నా ఎక్కువ నగరాల్లో 8,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలకు నియామకాలను చేపడుతున్నట్టు ప్రకటించగా, అందులో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, ముంబయి, కోల్‌కతా, నోయిడా, అమృతసర్, అహ్మదాబాద్, భోపాల్, కోయంబత్తూరు, జైపుర, కాన్పూర్, లూథియానా, పుణె, సూరత్ తదితర నగరాలు ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలు కార్పొరేట్, సాంకేతిత, వినియోగదారుల సేవలు, పని నిర్వహణ బాధ్యతలలకు విస్తరించి ఉన్నాయి. కెరీర్ డే ఆసక్తిదాయక సమాచారయుక్తమైన సెషన్లను కలిగి ఉండగా, అందులో అమెజాన్ సీఈఓ యాండి జస్సితో ఫైర్ సైడ్ చాట్ ఒకటి. అందులో ఆయన తన ఉద్యోగ అనుభవాలను ఉద్యోగాకాంక్షలతో పంచుకుని, వారికి సలహాలు ఇస్తూ, మార్గనిర్దేశనం చేయనున్నారు. అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియరు ఉపాధ్యక్షుడు, కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ కీలక ఉపన్యాసాన్ని చేస్తారు. అనంతరం అమెజాన్ లీడర్లు మరియు ఉద్యోగులతో బృంద చర్చలు చేయనుండగా, ‘లైఫ్ ఎట్ అమెజాన్’ ద్వారా పని చేసే చోటులో తన విశిష్ఠ సంస్కృతి, అమెజాన్ పని చేసేందుకు ఎలా మహోన్నత కేంద్రంగా ఉందో తెలియజేయనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్లోబల్, భారత-కేంద్రిత కార్యక్రమాలు ఉండగా 140 మంది అమెజాన్ రిక్రూటర్లు 2,000 ఉచిత, ఒన్-ఆన్-ఒన్ కెరీర్ కోచింగ్ కార్యక్రమాలను ఉద్యోగాకాంక్షులతో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉద్యోగాల్లో నియమించుకునే వారు ఉద్యోగం కోసం నియామక ప్రక్రియను పరిణామకారిగా ఎలా నిర్వహించాలి, రెస్యూమ్-రూపొందించుకునే కౌశల్యాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన సలహాలను ఇస్తుండగా, అవి అభ్యర్థులకు సరైన ఉద్యోగాలను వెతుక్కుని, ఎంపిక చేసుకునేందుకు మద్ధతు ఇవ్వనున్నాయి.
‘‘మా వినియోగదారుల తరుపున అన్వేషించడం, భారీ స్థాయిలో పరిణామాన్ని చూపించడం మరియు వృద్ధి చెందేందుకు ప్రత్యేక కేంద్రంగా మేము రూపుదిద్దుకున్నాము’’ అని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ ఉపాధ్యక్షుడు మరియు కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘అమెజాన్ నేతృత్వంలోని ఆవిష్కరణలు నిత్య జీవితాలు, జీవనోపాధిపై ఎలా పరిణామాన్ని చూపిస్తుందో అని తెలుసుకోవడం వినూత్న అనుభవం అని చెప్పవచ్చు. ఎక్కువ మంది వినియోగదారులు, వ్యాపారాలు గతంలో కన్నా ఇప్పుడు మాపై ఎక్కువ విశ్వాసాన్ని, భరోసాను ఉంచుతున్నాయి. మేము ఇప్పుడే ప్రారంభిస్తున్న, ఆసక్తి ఉన్న ఔత్సాహికులతో భారతదేశాన్ని డిజిటల్ విధానంలోకి మార్చుతున్న, జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తారని వేచి చూస్తున్నాము. ఈ కెరీర్ డే రోజు మేము 21వ శతాబ్దంలో భారతదేశపు సామర్థ్యాన్ని గుర్తించేందుకు, ఈ పరంపరకు ఉన్న శక్తి సామర్థ్యాలు మరియు అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము’’ అని తెలిపారు.
అమెజాన్ నేడు విస్తృత రంగాలైన ఇంజినీరింగ్, అప్లయిడ్ సైన్సెస్, బిజినెస్ మేనేజ్మెంట్, సప్లయ్ చెయిన్, ఆపరేషన్స్, ఆర్థిక, హెచ్ఆర్ టు అనలిటిక్స్, కంటెంట్ సృష్టి మరియు స్వాధీనం, మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ భద్రత, వీడియో, మ్యూజిక్ తదితర రంగాల్లో 1 లక్ష మంది వృత్తి నిపుణులను కలిగి ఉంది. భారతదేశం అమెజాన్‌కు రెండవ అతి పెద్ద సాంకేతిక కేంద్రం కాగా, భారతదేశంలోని ప్రతిభలు కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకునేలా కంపెనీ బాటలు పరిచింది.
ప్రభుత్వ ఆధునిక, డిజిటల్ విధానాలతో కూడిన మార్పు లక్ష్యాలకు అమెజాన్ అనుగుణంగా ఉంది. అమెజాన్ ఇండియా ఫైనాన్స్ ఉపాధ్యక్షుడు, ఇండియా సిఎఫ్ఓ రాఘవరావ్, ఎఐఎస్పిఎల్ ఎడబ్ల్యూఎస్ ఇండియా, దక్షిణ ఆసియా కమర్షియల్ బిజినెస్ అధ్యక్షుడు పునీత్ చందోక్, అమెజాన్ పే ఇండియా సీఈఓ మహేంద్ర నేరుకర్ తదితర నిపుణులతో కూడిన బృంద కార్యక్రమాల్లో శక్తియుతమైన నిపుణుల చర్చల ద్వారా అమెజాన్ భారతదేశంలో మూడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపార రంగాలైన ఇ-కామర్స్, ఆర్థిక సేవలు మరియు వెబ్ సేవల భవిష్యత్తు భాహ్య రూపాన్ని పంచుకోనుంది. ఈ కార్యక్రమం ఎపిఎసి, ఎంఇఎన్ఎ, ఎల్ఎటిఎఎం కస్టమర్ పుల్‌ఫిల్‌మెంట్ ఆపరేషన్స్ ఉపాధ్యక్షుడు అఖిల్ సక్సేనాతో ఫైర్ సైడ్ చాట్ ఉండగా, వారు దేశ వ్యాప్తంగా చిన్న నగరాలతో కలిపి అమెజాన్ సృష్టిస్తున్న ఉద్యోగ అవకాశాల గురించి అందులో వివరిస్తారు.
ఇతర ఆసక్తిదాయక గ్రూపు చర్చలు, పాల్గొన్న వారికి కూడా అమెజాన్ ఉద్యోగుల నుంచి ఆలకించే అవకాశాలు లభిస్తాయి. అందులో వారు తమ ఉద్యోగంలో వచ్చిన మార్పులు, ఆవిష్కారాలను ప్రారంభించడం, మార్పుకు కారణమైన పథకాల్లో పని చేసే తమ అనుభవాలను పంచుకుంటారు. ‘డే ఒన్’ మనస్థితికి చెందిన ప్రత్యేకమైన అమెజాన్ సంస్కృతి ఉద్భవం గురించి వివరిస్తారు. అమెజాన్ భారతదేశంలో 2025 నాటికి 20 లక్షల ప్రత్యేక, పరోక్ష ఉద్యోగాలను సృష్టించేందుకు కట్టుబడి ఉంది. భారతదేశంలో మొత్తం 10 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. అమెజాన్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సృష్టి, కౌశల్య కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు మద్ధతు ఇస్తోంది. మన దేశంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న యువత ద్వారా డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను గరిష్ఠం చేసేందుకు తన వంతు పాత్రను పోషిస్తోంది. అమెజాన్ రిక్రూటర్లతో ఒన్-ఆన్-ఒన్ ఉచిత కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమాలను సెప్టెంబరు 16 మంది 17న నిర్వహిస్తున్నారు. అమెజాన్ కెరీర్ డే సెప్టెంబరు 16 ఉదయం 10:10కు ప్రారంభమవుతుంది.