Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్వెల్ అధ్యక్షుడు కెవిన్ ఫైగీ
హైదరాబాద్: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అభిమానమైన పాత్రను పోషించిన నటాషా రోమనోఫ్ సాధారణ మహిళ నుంచి కోపధారిగా, తిరుగులేని బ్లాక్ విడోగా ఎలా మారిందో ఈ సరికొత్త చిత్రంలో అభిమానులు చూస్తారు. ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా, యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ బ్లాక్ విడోను భారతదేశంలో మొదటిసారిగా అనేక భాషల్లో ఈ సెప్టెంబర్ 3 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ సూపర్ స్టార్ స్కార్లెట్ జోహన్సన్ మరోసారి నటాషా రొమానోఫ్ లేదా బ్లాక్ విడో థ్రిల్లింగ్ కథను భారతదేశంలోని అభిమానులు ఆస్వాదిస్తారు. హై-ఆక్టేన్ యాక్షన్ మరియు థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో నిండిన, మార్వెల్ స్టూడియోస్ చిత్రం బ్లాక్ విడోలో తన యవ్వనం నుంచి ప్రమాదకరమైన కుట్రను ఎదుర్కొంటుంది. తాను వదిలిపెట్టిన గతానికి చెందిన తన శత్రువులను ఎదుర్కొనేందుకు ఆమె మరోసారి రంగంలోకి దిగుతుంది.
బ్లాక్ విడో కథ గురించి మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కెవిన్ ఫైగీ మాట్లాడుతూ ‘‘ఆమెకు అంత గొప్ప నేపథ్యం ఉంది. మేము దీని గురించి ఇతర చిత్రాలు అన్నింటిలో సూచన ప్రాయంగా తెలియజేశాము. కానీ మేము ఇప్పుడు దానిని పూర్తిగా ఊహించని విధంగా చూపిస్తున్నాము. ఆమె చాలా కాలంగా ఉన్నప్పటికీ- మధ్యలో మేము ఆమెను ఇతర సినిమాల్లో చూసినప్పుడు -వాటిలో కొన్ని అంశాలు ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కేట్ లాస్ ఏంజిల్స్‌కు వచ్చింది మరియు పాత్ర మరియు తనకు దక్కిన అవకాశాలతో ప్రేమలో పడింది. అత్యంత వ్యక్తిగత కథను చెప్పగలనని, పెద్ద కాన్వాస్‌పై ప్రత్యేకంగా ఏదైనా చేయగలదని ఆమె గ్రహించింది’’ అని పేర్కొన్నారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన, ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మార్వెల్ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఫ్లోరెన్స్ పగ్, రాచెల్ వీజ్, డేవిడ్ హార్బర్‌తో సహా అనేక అద్భుతమైన నటీనటులు ఉన్నారు.