Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు, భవిష్యత్‌కు సిద్ధమైన గెలాక్సీ ఎం 32 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 12 బ్యాండ్ మద్దతుతో విడుదల చేసింది. రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్ అందిస్తామనే వాగ్ధానంతో 5జీ అనుభవాలను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ శక్తివంతమైన #మాన్స్టర్ లైక్ ఏ బాస్ గెలాక్సీ ఎం 32 5జీ ను వేగవంతమైన జీవితాలను గడుపుతూ సాంకేతికతను అమితంగా అభిమానించే మిల్లీనియల్స్ మరియు జెన్ జెడ్ వినియోగదారుల కోసం తీర్చిదిద్దారు. డైమెన్శిటీ 720 ప్రాసెసర్‌ను కలిగిన భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎం 32 5జీ నిలువడంతో పాటుగా శాంసంగ్ యొక్క డిఫెన్స్ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీని సైతం ఇది కలిగి ఉంది.
‘‘ గెలాక్సీ ఎం సిరీస్‌ను 2019లో మార్కెట్లో విడుదల చేసిన నాటి నుంచి సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. అత్యున్నత అనుభవాలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ఇది ఎప్పుడూ ఆన్‌లో ఉండే జెన్ జెడ్ వినియోగదారుల వృద్ధి చెందుతున్న కోరికలను తీర్చనున్నాయి. భారతదేశంలో 5జీ విప్లవానికి మేము సిద్ధమైన వేళ, పూర్తి సరికొత్త గెలాక్సీ ఎం 32 5జీ, మాన్స్టర్ వారసత్వాన్ని దీని యొక్క 12 బ్యాండ్ మద్దతుతో మరింత ముందుకు తీసుకువెళ్తూనే రెండు ఓఎస్ అప్‌గ్రేడ్స్ వాగ్ధానమూ చేస్తుంది. తద్వారా మా వినియోగదారులు ఎల్లప్పుడూ భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్నారనే భరోసానూ అందిస్తుంది. గెలాక్సీ ఎం 32 5జీ లో శాంసంగ్ యొక్క డిఫెన్స్ గ్రేడ్ మొబైల్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ నాక్స్, ప్రీమియం డిజైన్ ఉన్నాయి. ఇవి మా వినియోగదారులను మాన్స్టర్ లైక్ ఏ బాస్ లా వెళ్లేందుకు తోడ్పడతాయి’’ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు. ‘‘మీడియా టెక్ డైమెన్శిటీ 720, మధ్యశ్రేణి 5జీ స్మార్ట్ఫోన్లలో ప్రీమియం అనుభవాలను అందిస్తుంది. ఈ శక్తి సామర్థ్యం కలిగిన 7ఎన్ఎం ఎస్ఓసీ, మీడియా టెక్ డైమెన్శిటీ 720తో శక్తివంతమైన మొట్టమొదటి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం 32 5జీ. ఇది అత్యాధునిక కనెక్టివిటీ, అత్యుత్తమ శ్రేణి శక్తి సామర్థ్యం, స్మార్టర్ కెమెరాలు, మృదువైన స్ట్రీమింగ్, పూర్తి ఇంటిగ్రేటెడ్ 5జీ మోడెమ్‌ను మీడియా టెక్ 5ఈ అలా్ట్రసేవ్తో అందిస్తుంది. ఇది అదనపు
విద్యుత్ ఆదా సాంకేతికతలను కలిగి ఉంది. శాంసంగ్‌తో మా అనుబంధం మరింత ముందుకు కొనసాగాలని, వారు విడుదల చేయబోయే ఉపకరణాలలు మా డైమెన్శిటీ ప్లాట్‌ఫామ్స్‌తో రూపుదిద్దుకోవాలని కోరుకుంటున్నాం’’ అని కుల్దీప్ మాలిక్, డైరెక్టర్,కార్పోరేట్ సేల్స్, మీడియా టెక్ ఇండియా అన్నారు.
భవిష్యత్‌కు సిద్ధంగా ఉండండి గెలాక్సీ ఎం 32 5జీ స్మార్ట్‌ఫోన్ పన్నెండు 5జీ బ్యాండ్స్‌తో వస్తుంది. వేగవంతమైన స్పీడ్‌తో పాటుగా అతి తక్కువ లాటెన్సీ కలిగిన ఈ స్మార్ట్ఫోన్లు కళ్లు మూసి తెరిచేంతలో మీ కంటెంట్ పంచుకోవడం, స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఈ పన్నెండు బ్యాండ్లు – ఎన్1, ఎన్3, ఎన్ 5, ఎన్ 7, ఎన్8, ఎన్ 20, ఎన్ 28, ఎన్ 38, ఎన్ 40, ఎన్ 41, ఎన్ 66, ఎన్ 78–కు మద్దతునందించేందుకు తయారు చేయబడిన గెలాక్సీ ఎం 32 5జీ, ఈ విభాగంలో స్మార్ట్ కొనుగోలుగా సాటిలేని మరియు ఖచ్చితమైన సూపర్‌ఫాస్ట్ మరియు మృదువైన 5జీ అనుభవాలను అందిస్తుంది. 5జీ నెట్‌వర్క్‌లో డాటా వేగం 4జీతో పోలిస్తే 20 రెట్ల వేగంగా ఉండటంతో పాటుగా లాటెన్సీ 10 రెట్లు తగ్గుతుంది. 10 రెట్లు సమర్థవంతంగా ఐఓటీ కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాదు, ఇది రెండు
సంవత్సరాల గ్యారెంటీడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో వస్తుండటం చేత మీరు భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్నారనే భరోసానూ అందిస్తుంది.
మెమరీ వేరియంట్స్, ధర, లభ్యత గెలాక్సీ ఎం 32 5జీ ధర 6జీబీ+128జీబీ మోడల్‌కు 20,999 రూపాయలు కాగా ; 8జీబీ+128 జీబీ మోడల్ ధర 22,999 రూపాయలు. శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్ తో పాటుగా సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్, ఎంపిక చేసిన వాణిజ్య స్టోర్ల వద్ద గెలాక్సీ ఎం 32 5జీ లభించనుంది. మీడియా టెక్ డైమెన్శిటీ 720 ప్రాసెసర్‌తో శక్తివంతమైన గెలాక్సీ ఎం 32 5జీ , అత్యధిక వేగంతో కూడిన పనితీరును అందిస్తుంది. గెలాక్సీ ఎం 32 5జీలో శక్తివంతమైన మరియు సమర్థవంతమైన 5జీ ప్రాసెసర్ ఉంది. ఇది అత్యధిక వేగవంతమైన పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్ మరియు తగ్గించబడిన విద్యుత్ వినియోగంను బ్రౌజింగ్ లేదా బహుళ యాప్స్ వినియోగ సమయంలో అందిస్తుంది. గేమర్ల కోసం, ఏఐ ఆధారిత గేమ్ బూస్టర్ అత్యాధునిక గేమింగ్ ప్రదర్శన అవరోధాలు లేని గేమింగ్ అనుభవాలను అందిస్తుంది.
గెలాక్సీ ఎం 32 5జీలో ఈ విభాగంలో అత్యుత్తమమైన 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది మరుపురాని క్షణాలను, అద్భుతమైన చిత్రాలను ఒడిసి పడుతుంది. వెనుకవైపు గెలాక్సీ ఎం 32 5జీలో 48 మెగా పిక్సెల్ ప్రధానమైన కెమెరా ఉంటుంది. ఇది అత్యధిక రిజల్యూషన్‌తో స్పష్టమైన చిత్రాలను రోజంతా తీసుకుంటూనే ఉంటుంది. 8 మెగా పిక్సెల్ అలా్ట్ర వైడ్ లైన్స్, అదనపు కోణాన్ని ఫోటోగ్రాఫ్స్‌కు అందిస్తుంది. అదే సమయంలో 5 మెగా పిక్సెల్ మ్యాక్సో లెన్స్ క్లోజప్ షాట్స్‌ను సైతం అత్యద్భుతమైన వివరాలు మరియు బొకే షాట్స్‌తో తీస్తుంది. దీనిలోని 2 మెగా పిక్సెల్ కెమెరా బ్లాక్గ్రౌండ్ను బ్లర్ చేయడంతో పాటుగా వినియోగదారులు అత్యద్భుతమైన పోట్రెయిట్ షాట్స్‌ను తీసుకునేందుకు సైతం తోడ్పడుతుంది. గెలాక్సీ ఎం 32 5జీలో ముందు వైపు 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఇది అధిక స్పష్టతతో కూడి, చూడగానే ఆకట్టుకునే సెల్ఫీలను తీస్తుంది.
గెలాక్సీ ఎం 32 5జీలో శాంసంగ్ నాక్స్, శాంసంగ్ డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ ఉంది. ఇది వ్యక్తిగత సమాచారం మరియు డాటాను వాస్తవ సమయంలో రక్షిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 మరియు ఒన్ యుఐ 3.1కు మద్దతునందించడంతో పాటుగా సహజమైన అనుభవాలను మరియు స్థిరమైన ఇంటరాక్షన్స్‌ను మెరుగుపరిచిన స్పందన, తగ్గించబడిన అవాంతరాలతో అందిస్తుంది.
బాస్‌లా ఏకధాటిగా వీక్షణ చేస్తూనే ఉండండి గెలాక్సీ ఎం 32 5జీ లో అత్యద్భుతమైన 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ –డిస్ప్లే ఉంది. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను వాస్తవమైన స్ర్కోలింగ్, గేమింగ్‌తో అందిస్తుంది. గెలాక్సీ ఎం 32 5జీలో డాల్బీ అట్మాస్ మద్దతు వైర్డ్, బ్లూటూత్ హెడ్ సెట్స్‌పై అందిస్తుంది. అసాధారణ ఆడియో, సినిమాటిక్ వీక్షణ అనుభవాలనుఅందిస్తుంది.