Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పైసాబజార్.కామ్, ఇండియాలో అతిపెద్ద* డిజిటల్ కన్జూమర్ క్రెడిట్ మార్కెట్‌ప్లేస్, తమ అతి పెద్దదైన రూ. 9.35 కోట్ల విలువైన హోమ్ లోన్ కేస్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించింది. పైసాబజార్ ప్లాట్‌ఫామ్ ద్వారా మూలం అయిన హోమ్ లోన్‌ను, హైదరాబాద్ వాసికి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ జారీ చేసింది. "బహుళ ఆఫర్లను పోల్చుకుని, ఉత్తమమైన దాన్ని ఎంచుకునే సౌలభ్యాన్ని పైసాబజార్ నాకు కల్పించింది. పెద్ద మొత్తం అయినా సరే, నాకు ఎంతో గొప్పగా, ఇబ్బందులు లేని అనుభూతి దక్కింది” అని హైదరాబాద్‌లో ఆంట్రప్రెన్యూర్‌గా ఉంటున్న, అధిక మొత్తంలో హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్ నితిన్ అగర్వాల్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా, డిజిటల్ మీడియమ్స్ ఉపయోగిస్తూ సరైన హోమ్ లోన్ ఆఫర్‌ను వెతకడంలో, అన్ని కన్జూమర్ విభాగాలలో మాతో అనుబంధం పెరుగుతోందని, పైసాబజార్ వెల్లడించింది. పైసాబజార్ ప్లాట్‌ఫామ్‌కు, రూ. 50 లక్షల మొత్తానికి మించిన ఎంక్వైరీలను నెలకు ~10,000లకు పైగా అందుతుండగా, గతంలో కూడా పలు పెద్ద మొత్తాల హోమ్ లోన్లను పూర్తి చేసింది.
“కన్జూమర్ ప్రవర్తనలో పరిణతి, మార్కెట్ లీడర్‌గా మేము పెంచుకున్న విశ్వాసాలను రెండింటిని అధిక మొత్తాల రుణ మంజూరులు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కన్జూమర్లకు ఇంటిని కొనుగోలు చేయడం అనేది, వారి జీవితంలో అత్యంత కీలకమైన జీవిత లక్ష్యాలలో ఒకటి, దీనిని అందుకోవడంలో సహకరించడం మాకు ఎంతో సంతోషకరం” అని పైసాబజార్.కామ్ సీఈఓ &కో-ఫౌండర్ అయిన నవీన్ కుక్రేజా వెల్లడించారు. రుణ ఆర్థిక వ్యవస్థ వ్యాప్తంగా హోమ్ లోన్లను అందించేందుకు, భారతదేశంలో అతి పెద్ద బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హెచ్‌ఎఫ్‌సీలతో సహా, పైసాబజార్.కామ్‌కు 20+ యాక్టివ్ భాగస్వామ్యాలు ఉన్నాయి. “వినియోగదారులకు రుణాల ద్వారా అయ్యే మొత్తం ఖర్చులో భారీ అంతరాన్ని తెచ్చే అవకాశం డడంతో, సరైన హోమ్ లోన్ ఆఫర్‌ను పోల్చుకుని, ఎఁచుకోవడం ఎంతో కీలకమైన విషయం. పైసాబజార్ వద్ద, అనుభవజ్ఞుల సలహా, సహకారాల పాటు చక్కని భాగస్వామ్యాల ద్వారా సౌకర్యవంతమైన పారదర్శకమైన ప్రక్రియల ద్వారా, వినియోగదారులకు ఎక్కువ ఎంపికలను అందించడం మా లక్ష్యం,” అని రతన్ చౌదరి, బిజినెస్ హెడ్-హోమ్ లోన్స్, పైసాబజార్.కామ్ వెల్లడించారు.