Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలన్ మస్క్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై దృష్టి పెట్టారు. తమ స్టార్‌లింక్ సేవల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని గురువారం ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. దేశంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తే సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. ఒక చిన్న యాంటెన్నాతో ఇంటర్నెట్ను పొందడానికి వీలుంది.