Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్కు దిగ్గజ కంపెనీ టాటా స్టీల్ ఉద్యోగాల కల్పనలో అరుదైన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్‌లోని తన వెస్ట్ బొకారో డివిజన్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషీనరీ ఆపరేటర్లు (ట్రైనీ)గా కేవలం ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. 10వ తరగతి ఉత్తీర్ణులై 1981 నుంచి 2003 మధ్య పుట్టినవారి నుంచి దరఖాస్తులను కోరుతున్నామని పేర్కొంది. రామ్‌ఘఢ్ వెస్ట్ బొకారో బొగ్గు విభాగంలో హెచ్ఈఎంఎం శిక్షణ ఆపరేటర్లుగా ట్రాన్స్జెండర్ల నుంచి మాత్రమే అభ్యర్ధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోన్నటు స్పష్టం చేసింది. అభ్యర్ధులు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ ఓరియంటేషన్ పరీక్ష అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. సంస్ధలో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే క్రమంలో ఈ చొరవ తీసుకుంది.