Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్‌కు 514 పాయింట్ల లాభం
ముంబయి : కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. వాహన, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు రాణించడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 514 పాయింట్లు లేదా 0.9 శాతం పెరిగి 57,852.5కు చేరింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 158 పాయింట్లు లేదా 0.92 శాతం రాణించి 12,234 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్లో సెన్సెక్స్ 215 పాయింట్లు కోల్పోయింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.9శాతం, 0.8శాతం చొప్పున లాభపడ్డాయి. టీసీఎస్, హెచ్‌యూఎల్, టైటన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ ఐటీ రంగాలు 1.5శాతం మేర పెరగ్గా.. ఫార్మా, లోహ, రియాల్టీ, ప్రయివేటు బ్యాంక్‌లు, ఫైనాన్సీయల్ సర్వీసెస్ రంగాలు 1 శాతం మేర లాభపడ్డాయి.
.