Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ దేశంలోనే తొలిసారి 5జీ టెక్నాలజీ సహాయంతో క్లౌడ్ గేమింగ్‌ను విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించింది. టెలికం శాఖ (డీఓటీ) కేటాయించిన స్పెక్ట్రమ్ 5జీ ట్రయల్స్‌లో భాగంగా గుర్గావ్లో ఈ ప్రదర్శన నిర్వహించినట్టు ఎయిర్టెల్ చీఫ్ టెక్నలాజీ ఆఫీసర్ రందీప్ సెకోన్ తెలిపారు. వచ్చే ఏడాది 5జీ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. గేమ్ ఆడే సమయంలో 3500 మెగాహెర్ట్జ్ అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాండ్‌కు కనెక్ట్ అయినట్టు సంస్థ తెలిపింది. దేశంలో మొబైల్ గేమింగ్ దాదాపు రూ.18వేల కోట్ల విలువ చేస్తుందన్నారు. దేశంలో ఆన్ లైన్ గేమర్లు సంఖ్య 2022 నాటికి 51 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు