Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.4,000 కోట్ల నిధులు సమీకరించినట్టు వెల్లడించింది. బాండ్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నట్టు ఆ బ్యాంక్ గురువారం తెలిపింది. రూ.1,000 కోట్ల కనీస మొత్తంతో జారీ చేసిన బాండ్లకు భారీ స్థాయిలో డిమాండ్ వచ్చిందని పేర్కొంది. రూ.10 వేల కోట్లకుపైగా విలువైన బిడ్స్ రాగా.. 7.72 శాతం కూపన్ రేటుతో రూ.4,000 కోట్ల విలువైన బిడ్స్‌ను అంగీకరించినట్టు వెల్లడించింది.