Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
దేశంలోని డిజిటల్ పేమెంట్లపైన డేటా, లోతైన పరిశీలన, ధోరణులతో భారతదేశపు మొట్టమొదటి ఇంటరాక్టి వ్వెబ్సైట్ ఫోన్ పే ప్లస్ ను ఆవిష్కరించామని భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ సంస్థఅయిన ఫోన్ పే శుక్రవారం ప్రకటించింది., ఈ వెబసైట్ దేశపు ఇంటరాక్టివ్ మ్యాప్ లో వినియోగదారులు చేసే 2000కు పైగా లావాదేవీలను ప్రదర్శిస్తుంది. 45 శాతానికి పైగా మార్కెట్ వాటా కలిగిఉన్నందున ఫోన్ పే డేటా దేశ డిజిటల్ పేమెంట్ అలవాట్లను ప్రతిబింబిస్తుంది.
గడచిన ఐదేండ్లలో డిజిటల్ పేమెంట్ ల పరిణామక్రమంపై లోతైన అధ్యయనాన్ని అందించే పల్స్ రిపోర్ట్ ను కూడా ఫోన్ పే ఆవిష్కరించింది. 2016 నుంచి భారతదేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ల స్వీకరణ జరిగిన తీరు గురించి ఇది సమగ్రమైన అవగాహనను అందిస్తుంది. ఇందులో సమగ్రమైన, విభాగాల వారీ ధోరణులు కూడా ఉంటాయి. వెబ్సైట్, రిపోర్టలోని అంతర్ పరిశీలనలు రెండు ముఖ్యమైన వనరుల నుండి సేకరించినవాటి నుండి రూపొందించారు. విక్రేతలు, వినియోగదారుల ఇంటర్వ్యూలతో కలిపి, లావాదేవీ డేటాను ఆధారంగా చేసుకుని ఇవి రూపొందించారు.
ఈ వెబ్సైట్ ఆవిష్కరణ సందర్భంగా ఫోన్ పే ఫౌండర్, సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ, ఇది తనకెంతో ఆనందంగా ఉందన్నారు. డిజిటల్ పేమెంట్ల వాతావరణానికి తాము తిరిగి ఇస్తున్న పల్స్ అన్నారు.భారతదేశాన్ని నిర్మించడంలో ఇతరులకు తగినన్ని అవకాశాలను తెరచిఉంచడంలో సహాయ పడాలనే విషయంలో తాము కీలకం కావచ్చని భావిస్తున్నందునే తాము దీన్ని రూపొందించామని తెలిపారు.
ఫోన్ పే కో-ఫౌండర్, సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ ఈ రంగంలో పాలుపంచుకుంటున్నవారందరూ ఎదగడానికి అనుమతించే బహిరంగవేదికలను నిర్మించాలనే తమ తత్త్వ విజయంలో కీలకపాత్ర పోషిస్తోందని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని చెప్పారు.
వెబ్ సైట్ : http://pulse.phonepe.com.