Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
భారతదేశంలోని ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్కుల చెయిన్ వండర్లా హాలిడేస్ లిమిటెడ్, తన వండర్లా హైదరాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేసిన రోజుల్లో మాత్రమే సందర్శకులను అనుమతిస్తూ వస్తోంది. అయితే సెప్టెంబరు 2 అంటే నేటి నుంచి ఇకపై సోమవారం నుంచి ఆదివారం వరకు వండర్ లాను అన్ని రోజులూ తెరిచి ఉంచుతామని ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రోజూ ఉదయం 11 నుంచి సందర్శకులు ల్యాండ్, వాటర్ రైడ్స్ అన్నింటినీ వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అత్యున్నత భద్రతకు హామీ ఇచ్చే అమ్యూజ్మెంట్ పార్కులో కుటుంబం, స్నేహితులతో ఉత్తమ సమయాన్ని గడిపేందుకు ఇంతకన్నా మంచి చోటు మరెక్కడా దొరకదని కంపెనీ తెలిపింది.
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని వండర్ లా తెలిపింది. అలాగే పరిశుభ్రత, భద్రతా విధానాల్లో భాగంగా కంపెనీ రైడ్స్, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలు, కియోస్క్ తదితర ప్రాంతాల్లో గెస్ట్‌లు భౌతిక దూరం పాటించేలా ఫ్లోర్‌పై గుర్తులు ఉంచారు. హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించి కామన్ ఏరియాలు నిత్యం శుభ్రం చేయనున్నారు. అలాగే ఆమోదించబడిన రసాయనాలతో రైడ్లను తరచుగా శుభ్రపరుస్తారని తెలిపారు.
వండర్లాసిబ్బంది అందరూ టీకా వేయించుకున్నారని, అలాగే వారు మాస్కులు ధరించే ఉంటారని తెలిపారు. శానిటైజర్లు అందులో ఉంటాయని వివరించారు. భౌతిక దూరాన్ని పాటించే ప్రోటోకాల్‌కు అనుగుణంగా వండర్లాను సందర్శించే వారికి ఎంట్రీ టిక్కెట్లను ఆన్లైన్ పోర్టల్ bookings.wonderla.com ద్వారా ముందుగా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. భారతదేశంలో పరిశుభ్రత నిర్వహణ వ్యవస్థ కోసం BVQI నుంచి కొవ్-సేఫ్ ధ్రువీకరించిన మొదటి అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా అని సంస్థ తెలిపింది.
ఈ అమ్యూజ్మెంట్ పార్క్ రావిరాల విలేజ్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నం.13 వద్ద ఉందని, మరిన్ని వివరాలు లేదా బుకింగ్ కోసం వండర్లా వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది. https://www.wonderla.com/ లేదా 040 23490300, 040 23490333 నెంబర్లకు కాల్ చేయండి.