Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్
దేశంలో 5జి విభాగంలో మొదటిసారిగా, భారతదేశపు మొదటి క్లౌడింగ్ సెషన్‌ను 5జి పర్యావరణంలో విజయవంతంగా నిర్వహించామని భారతదేశపు అగ్రగామి కమ్యూనికేషన్ పరిష్కరణల సదుపాయకం భారతీ ఎయిర్టెల్ శుక్రవారం ప్రకటించింది. మానెసార్ (గుర్గావ్)లోని టెలి కమ్యూనికేషన్స్ శాఖ (భారత కేంద్ర ప్రభుత్వం) మంజూరు చేసిన స్పెక్ట్రం వినియోగించుకుని నిర్వహిస్తున్న 5జి పరీక్షల్లో భాగంగా ఈ ప్రదర్శనను నిర్వహించింది.
భారతదేశంలో ఇద్దరు టాప్ గేమర్లు, మోర్టల్ నమన్ మాథుర్, మాంబా సల్మాన్ అహ్మద్‌లతో 5జి క్లౌడ్ గేమింగ్ డెమోకు ఎయిర్టెల్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. గేమింగ్ సాంకేతికతను బ్లాక్నట్ ప్లాట్ఫారం ద్వారా అందుబాటులోకి తీసుకు రాగా, మోర్టల్ మరియు మాంబా అస్ఫాల్ట్లో స్ప్రింట్ రేసింగ్ సవాలును ఎదుర్కొన్నారు. వారి గేమింగ్ కౌశల్యాన్ని మెరుపు వేగం, 5జి పర్యావరణలో అత్యంత తక్కువ లేటెన్సీతో పరీక్షించారు.
మోర్టల్ మరియు మాంబా తమ గేమింగ్ అనుభవం గురించి వివరిస్తూ 'ఈ వేగానికి మేము నిజంగా మనసు పారేసుకున్నాము. ఇది స్మార్ట్‌ఫోన్‌లో హైఎండ్ పీసీ, కన్సోల్ నాణ్యత గేమింగ్ అనుభవాన్ని అందించింది. భారతదేశంలో 5జి ఆన్లైన్ వలయాన్ని సరికొత్తగా ఆవిష్కరించనుంది. భారతదేశంలో గేమ్స్ తయారు చేసి, విడుదల చేస్తూ, అవకాశాలను మెరుగుపురస్తూ, చిన్న నగరాల గేమర్లను ప్రధాన స్రవంతికి తీసుకు వచ్చేందుకు ఇది కీలక పాత్రను పోషించనుంది. ఈ అద్బుత అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఎయిర్‌టెల్‌కు మా కృతజ్ఞతలు` అని తెలిపారు.
మోర్టల్ మరియు మాంబా 3500 వీనఓ మేర ఉన్నత సామర్థ్యపు స్పెక్ట్రం బ్యాండ్‌కు అనుసంధానం చేసిన స్మార్ట్ఫోన్లలో థ్రిల్లింగ్ ఆటను ఆస్వాదించారు. ఈ 5జి పరీక్ష నెట్వర్క్ 1జిబిపిఎస్ కన్నా ఎక్కువ వేగాన్ని అందించగా, లేటెన్సీ 10 మిల్లీ సెకండ్ల శ్రేణిలో ఉంది.
క్లౌడ్ గేమింగ్ వినియోగదారులకు వీటిని డౌన్లోడ్ చేసుకోకుండానే లేదా గేమింగ్ హార్డ్‌వేర్‌కు పెట్టుబడి పెట్టకుండానే రియల్ టైమ్‌లో గేమ్స్ స్ట్రీమ్ చేసుకునేందుకు అలాగే ఆడుకునేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు 5జి నెట్వర్క్ అందుబాటులోకి రావడం ద్వారా క్లౌడ్ గేమింగ్ నూతన సహజత్వం కానుందన్న అంచనాలు ఉండగా, ఇందులో వినియోగదారులు హైఎండ్ కన్సోల్ తరహా గేమింగ్ అనుభవాన్ని ప్రయాణంలోనే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో అందుకుంటారు. భారతదేశంలోని అధిక సంఖ్యలో ఉన్న యువత, విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం అలాగే, 5జి నెట్‌వర్క్‌ల నుంచి మొబైల్ గేమింగ్ వి2.4 బిలియన్ మార్కెట్ అవకాశంగా వృద్ధి చెందుతోంది. భారతదేశంలో ప్రస్తుతం 436 మిలియన్ల గేమర్లు ఉండగా, 2022 నాటికి వీరి సంఖ్య 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది.
భారతీ ఎయిర్టెల్ సీటీవో రణ్‌దీప్ సెఖోన్ మాట్లాడుతూ 'క్లౌడ్ గేమింగ్ అనేది 5జి సేవలను అత్యంత ఎక్కువగా వినియోగించుకునే రంగాల్లో ఒకటి కాగా, దానికి అత్యంత వేగం, తక్కువ లేటెన్సీ సంయోజన కారణమని చెప్పవచ్చు. భారతదేశపు మొదటి 5జి డెమోను టెస్ట్ నెట్‌వర్క్‌లో ప్రదర్శించిన అనంతరం ఈ ఉత్సాహవంతమైన 5జి గేమింగ్ సెషన్‌ను నిర్వహించడం మాకు ఉత్కంఠను కలిగించింది. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రపంచంలో మరో భాగంలో కూర్చుకున్న వారితో రియల్ టైమ్ గేమింగ్‌ను ఆస్వాదించడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. భారతదేశంలో 5జి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది మా వినియోగదారులకు ఎయిర్టెల్ అందిస్తున్న ఉత్సహాకరమైన డిజిటల్ భవిష్యత్తుకు ఇది కేవలం ప్రారంభం మాత్రమే` అని వివరించారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్టెల్ 5జి సేవలను విజయవంతంగా హైదరాబాద్‌లో లైవ్ 4జి నెట్‌వర్క్‌పై ప్రయోగించి పరిశ్రమలో సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. భారతదేశం వ్యాప్తంగా పలు నగరాల్లో 5జి పరీక్షలను కూడా నిర్వహిస్తోంది మరియు సాంకేతికతల మూల్యాంకనతో, టెలికాం శాఖ ట్రయల్ పద్ధతిలో అందించిన స్పెక్ట్రం ద్వారా పలు ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ ఈ ప్రయోగాల నిర్వహణకు ఎరిక్సన్, నోకియాలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
భారతదేశంలో 5జి పరిష్కరణలను మరింత మెరుగుపరిచేందుకు ఒ-రాన్ అలయెన్స్‌తో ఎయిర్టెల్ తన ప్రయత్నాలను విస్తరిస్తోంది. ఇది ఇప్పటికే టాటా గ్రూప్, క్వాల్‌కాం, ఇంటెల్, మవెనిర్, అల్టియోస్టార్లతో భాగస్వామ్యన్ని ప్రకటించింది.