Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 1,80,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంధన పంప్లో లోపాలు ఉండటంతో పలు మోడళ్లను రీకాల్ చేస్తున్నట్టు పేర్కొంది. 2018 మే 4 నుంచి 2020 అక్టోబర్ 27 మధ్య తయారు చేసిన సీయాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎక్స్ ఎల్6ల పెట్రోల్ వేరియెంట్లను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. లోపాలు ఉన్న విడిబాగాలను నవంబర్ తొలి వారంలో ఉచితంగా మార్చి ఇవ్వనున్నట్టు వెల్లడించింది.