Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో నూతన రికార్డులను నెలకొల్పుతున్నాయి. శుక్రవారం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 58వేల పాయింట్ల ఎగువన నమోదయ్యింది. తుదకు 277 పాయింట్లు లేదా 0.48 శాతం పెరిగి 58,130 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు రాణించి 17,323.60 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.01 వద్ద నిలిచింది. నిఫ్టీలో రిలయన్స్ ఇండిస్టీస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, టైటాన్ కంపెనీ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, భారతి ఎయిర్టెల్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని ఇతర రంగాలు లాభపడ్డాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు నెలకొనగా రిలయన్స్ ఇండిస్టీస్ మద్దతుతో ముగింపు సమయంలో సూచీలు గరిష్ట స్థాయిలో ముగిశాయి.