Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెల్కోలకు ట్రారు ఆదేశాలు
న్యూఢిల్లీ : మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ఆఫర్ల ద్వారా వినియోగదారుల మధ్య తారతమ్యం చూపించడం ఆపాలని టెలికాం ఆపరేటర్లను, చానల్ పార్టనర్లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) ఆదేశించింది. ఎంఎన్‌పీ ఆఫర్ల ద్వారా వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు టారిఫ్‌లను ఆఫర్ చేయడం వివక్షాపూరితమని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను వెంటనే నిలిపేయాలని తెలిపింది. ఎంఎన్‌పి ఆఫర్లపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఒకదానిపై మరొకటి తనకు ఫిర్యాదు చేస్తున్నాయని పేర్కొంది. వినియోగదారులను ఆకర్షించడానికి థర్డ్ పార్టీ చానల్ భాగస్వాములు పలు ఆఫర్లు ఇస్తున్నట్టు టెల్కోలు పేర్కొంటున్నాయి. తమ అనుమతి లేకుండా ఎటువంటి ఆఫర్లను కస్టమర్లకు ఇవ్వజూపవద్దని ట్రారు ఆదేశించింది.