Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనాల ప్రకారం, అలెర్జీలతో సంబంధం కలిగి ఉన్న ప్రజలు దాదాపు 235 మిలియన్ల మంది ఉన్నారు. దాదాపు 30–40% మంది ప్రపంచ జనాభా, ఒకటి లేదా అంతకు మించిన అలెర్జిక్ పరిస్థితులతో తీవ్ర ప్రభావితమవుతున్నారు. ఈ అలెర్జిక్ స్థితిలలో అస్తమా, రైనటిస్, అనఫిలాక్సిస్, డ్రగ్, ఫుడ్ మరియు ఇన్సెక్ట్ అలెర్జీలు, ఎక్జెమా మరియు యుట్రికారియా (హైవ్స్) మరియు యాంజియోడెమా వంటివి ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా అలెర్జీల ఫ్రీక్వెన్సీ గణనీయంగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఇది మరింత ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో, దాదాపుగా ప్రతి 8 మంది చిన్నారులలో ఒకరు అస్తమాతో బాధపడుతుంటే, ప్రతి 13మందిలో ఒకరు ఎక్జెమా (తామర) మరియు ప్రతి 8 మందిలో ఒకరు అలెర్జిక్ రినిటిస్ తో బాధపడుతున్నారు. ఫుడ్ అలర్జీలు 3–6% మంది చిన్నారులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతి 40 మందిలో ఒకరు వేరుశెనగ మరియు పాలకు కూడా ఎలర్జీ బారిన పడుతుంటే ప్రతి 20 మందిలో ఒకరు గుడ్డుకు సైతం అలెర్జీ బారిన పడుతున్నారు.
అలెర్జీతో జీవించడం కష్టసాధ్యం. ఆహారం, చర్మ మరియు శ్వాససంబంధిత అలెర్జీలకు తమ సొంత నిబంధనలు ఉంటాయి. అవి మీ జీవితంపై ప్రభావమూ చూపవచ్చు. డాక్టర్ ముఖేష్ బాత్రా, పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు ఫౌండర్, డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ మాట్లాడుతూ ‘‘అలెర్జీలకు చికిత్సనందించడంలో నిరూపిత సామర్థ్యం హోమియోపతికి ఉంది. సహజసిద్ధంగా అలెర్జీలకు చికిత్సనందించడంలో మాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. దాదాపు 65వేల మంది రోగులు హోమియోపతి దీనికి చక్కగా పనిచేస్తుందనేందుకు నిదర్శనంగా ఉన్నారు. అత్యుత్తమ చికిత్సా ఫలితాలను అందించేందుకు మా అలెర్జీ స్పెషలిస్ట్‌లు సమగ్రమైన చికిత్సా పరిష్కారాలను తీర్చిదిద్దారు. ఇవి రోగులకు వేగవంతమైన మరియు నొప్పిలేనటువంటి అంతర్జాతీయ డయాగ్నోస్టిక్స్‌ను సహజసిద్ధమైన మరియు దుష్ప్రభావాలు లేని హోమియోపతితో అలెర్జీల నుంచి ఉపశమనం అందిస్తున్నారు. శాస్త్రీయంగా నిరూపితమైన, సమగ్రమైన అలెర్జీ చికత్సలలో అలెర్జియాన్ ఒకటి’’ అని అన్నారు. సెప్టెంబర్ 03వ తేదీతో ఆరంభించి, భారతదేశ వ్యాప్తంగా రోగులు ఖచ్చితమైన, శాస్త్రీయంగా నిరూపితమైన 45 రకాల ఆహార ఆధారిత అలెర్జిన్స్‌ను కేవలం 35 నిమిషాలలో అంతర్జాతీయ , సరళమైన, సౌకర్యవంతమైన సింగిల్ ప్రిక్ పరీక్షతో కనుగొనవచ్చు. శ్వాససంబంధిత అలెర్జీలతో బాధపడే రోగులు, మొట్టమొదటిసారి అనతగ్గ హోమియోపతిక్ నెబులైజేషన్ సహాయంతో హాయిగా శ్వాసించగలరు. అదే సమయంలో స్కిన్ సెన్సిటివ్స్ కలిగిన రోగులు హోమియోపతిక్ లైట్ థెరఫీ చికిత్స చక్కదనంతో ప్రయోజనమూ పొందగలరు.
శ్వాస సంబంధిత అలెర్జీలు
ధూళికణాలు, కాలుష్య కారకాలు, పెంపుడు జంతువుల నుంచి రాలే జుట్టు లేదా బూజు లాంటివి అత్యంత సవాల్‌తో కూడుకుని ఉంటాయి. ఈ చికాకులు కారణంగా ముక్కు పట్టేయడం, ముక్కు కారడం, గొంతు మంట, శబ్దాలురావడం, దగ్గు మరియు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. సంప్రదాయ చికిత్సలు మగతగా అనిపించడంతో పాటుగా మీ రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చు. డాక్టర్ బాత్రాస్ అలెర్జియాన్, శాస్త్రీయంగా నిరూపితమైనది. స్టెరాయిడ్స్ లేనటువంటిది మరియు దుష్పరిణామాలు లేని హోమియోపతిక్ నెబులైజర్‌ను కలిగి ఉంటుంది. ఇది మీ శ్వాససంబంధిత సవాళ్లను పరిష్కరిస్తుంది. మీరు లేదా మీ పిల్లల కోసం భయపడి లేదా స్టెరాయిడ్స్ దుష్పరిణామాలు అంటూ బాధపడుతూ ఆస్పత్రికి పరుగుపెట్టవలసిన అవసరం లేకుండా చేస్తుంది.
డాక్టర్ బాత్రాస్ రెస్పిరేటరీ చికిత్సలలో 96.3% సానుకూల ఫలితాలు వస్తున్నాయి. దీనిని అమెరికన్ క్వాలిటీ యాక్సెసర్స్ ధృవీకరించింది.
స్కిన్ అలెర్జీలు
స్కిన్ అలెర్జీలకు పుప్పొడి, సబ్బు, మొక్కలు, హెయిర్ డైలు, క్రీమ్‌లు వంటివి కారణమవుతుంటాయి. దురద, వాపులు, చర్మం ఎర్రబారడం, దద్దుర్లు, పొట్టు రాలడం, చర్మం పగుళ్లుకు దారితీయడం వంటి లక్షణాలు కనిపించడంతో పాటుగా ఇది నొప్పిగానూ ఉంటుంది. డాక్టర్ సలహా తీసుకోకుండా షాప్‌ల వద్ద కనుగోలు చేసే మందుల కారణంగా చర్మం పాడవడంతో పాటుగా దుష్పరిణామాలు కూడా కలుగవచ్చు. డాక్టర్ బాత్రాస్ డెర్మాహీల్తో, మీరు స్కిన్ అలెర్జీలకు తగిన చికిత్సపొందవచ్చు. విప్లవాత్మక చర్మ సంరక్షణ చికిత్స డెర్మా హీల్. యువీబీ కాంతి కిరణాల చక్కదనంతో హోమియోపతి మిళితం కావడంతో పాటుగా మీ చర్మ అలెర్జీలకు సురక్షితమైన, సహజమైన చికిత్సను అందిస్తుంది. ప్రతి డెర్మా హీల్ సెషన్ కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది మరియు సుశిక్షితులైన థెరపిస్ట్‌లు, అర్హత కలిగిన హోమియోపతిక్ డెర్మటాలజిస్ట్‌ల మార్గనిర్దేశనంలో ఈ చికిత్స అందిస్తారు.
నిరూపితమైన సామర్థ్యంతో 400కు పైగా క్లీనికల్ రీసెర్చ్ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ఈ చికిత్సతో కేవలం ఐదు వారాలలోనే అత్యుత్తమ ఫలితాలను పొందగలరు.
ఆహార అలెర్జీలు
గుడ్డు, చేప, మాంసం, వేరుశెనగ, పాలు, గోధుమ, సోయా మరియు షెలఫిష్ లాంటి ఆహారాల వల్ల అలెర్జిక్ రియాక్షన్స్ వస్తుంటాయి. వీటి వల్ల లో బ్లడ్ ప్రెజర్, నాలుక వాయడం, నోరు మరియు ముఖం వాయడం, దద్దుర్లు, వాంతులు, దురద, శ్వాసతీసుకోవడంలో కష్టం, డయేరియా వంటివి ఉంటాయి. తీవ్రమైన కేసులలో , అది అనాఫిలాక్సిస్ (ప్రొటీన్ లేదా డ్రగ్స్ కు హైపర్సెన్సిటివ్ రియాక్షన్)కు దారి తీయవచ్చు. డాక్టర్ బాత్రాస్ యొక్క శాస్త్రీయంగా నిరూపితమైన ఫుడ్ అలర్జీ పరీక్షకు కేంబ్రిడ్జ్ న్యూట్రిషనల్ సైన్సెస్ తోడ్పాటునందిస్తుంది. ఐజీఈ మెడికేటెడ్ ఫుడ్ ఇన్టోలరెన్స్పై ఇది దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ ఆహార పరీక్షలో లాక్టోజ్ ఇన్టోలరెన్స్, ప్రొటీన్ ఇన్టోలరెన్స్, గ్లుటెన్ ఇన్టోలరెన్స్ మరియు నట్స్ ఇన్టోలరెన్స్ వంటివి భాగంగా ఉంటాయి.
డాక్టర్ బాత్రాస్ గ్యాస్ర్టోఎంటరాలజికల్ చికిత్సలలో 97.2% సానుకూల ఫలితాలు వస్తున్నాయని అమెరికన్ క్వాలిటీ యాక్సెసర్స్ ధృవీకరించింది.
డాక్టర్ బాత్రాస్ అలెర్జియాన్ విడుదల సందర్భంగా రోగులు ఇప్పుడు ప్రత్యేక పరిచయ ఆఫర్‌గా ఫ్లాట్ 15%ను సమగ్రమైన అలెర్జీ పరిష్కారాలపై పొందవచ్చు. మీ దగ్గరలోని డాక్టర్ బాత్రాస్ క్లీనిక్‌ను సందర్శించడం లేదా 91677 91677కు కాల్ చేయడం ద్వారా సంప్రదించవచ్చు.